ప్రభాస్‌.. `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో `సలార్‌` చిత్రం చేయబోతున్నారు.  హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఆడిషన్‌ జరుగుతుంది. ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 

`సలార్‌`  చిత్రంలో చాలా వరకు కొత్త కాస్టింగ్‌ని తీసుకుంటున్నారు. అందుకోసం అన్ని రకాల ఏజ్‌ గ్రూపులను చెందిన వారిని ఎంపిక చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆడిషన్‌ ప్రారంభమైంది. అయితే ఇప్పుడిది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. మరోవైపు ఆడిషన్‌ కోసం భారీగా తరలి వచ్చారు. భారీ క్యూలో ఉన్నారు. `సలార్‌` ఆడిషన్‌కి ఊహించని విధంగా రెస్పాన్స్ రావడం విశేషం. వీరంతా డిటైల్స్ ఇచ్చేందుకు వచ్చారు. ఈ నెల పదిహేడునుంచి ఆడిషన్‌ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. 

ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. 2022లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ రాజుకి రైట్‌ హ్యాండ్‌ తరహాలో ఉండే అత్యంత హింసాత్మకమైన నాయకుడిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. మరి దీన్ని ఎప్పుడు చేస్తాడనేది సస్పెన్స్ నెలకొంది.