ప్రభాస్‌ తన అభిమానులకు వాలెంటైన్స్ డే ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఈ నెల 14న ఈ చిత్రంలోని చిన్న గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సరికొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ లవర్‌ బాయ్‌గా ఆకట్టుకుంటున్నారు. ఓ పెద్ద భవంతి ముందు నుంచి స్టయిల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా తాజా పోస్టర్‌ని పంచుకున్నారు. 

ఇదిలా ఉంటే ఇందులో లవ్‌ గ్లింప్స్ కి సంబంధించిన టైమ్‌ని ఖరారు చేశారు. ఆదివారం ఉదయం 9.18 నిమిషాలకు `గ్లింప్స్ రాధేశ్యామ్‌` విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంతకు ముందు విడుదల చేసిన గ్లింప్స్ కి సంబంధించిన క్లిప్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. ఇది తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంగీత దర్శకులు ఖరారయ్యారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ తెలుగుతోపాటు సౌత్‌ లాంగ్వేజెస్‌కి సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇక హిందీకి మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ని ఫైనల్‌ చేశారు.