ప్రభాస్ హీరో నటించిన సలార్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ అందుకుంది. ఫస్ట్ డే విశేష స్పందన దక్కింది. సలార్ సక్సెస్ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ కి దారితీసింది.  

డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న సలార్ ఓపెనింగ్స్ పరంగా సత్తా చాటింది. వరల్డ్ వైడ్ సలార్ ఫస్ట్ డే రూ.180 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రభాస్ ప్రీవియస్ రికార్డ్స్ బద్దలయ్యాయి. డంకీ మూవీ నుండి గట్టి పోటీ ఎదురైనా కానీ... బాక్సాఫీస్ వద్ద సలార్ దుమ్మురేపింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ప్రెజెంట్ చేసిన విధానం ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయి. కథ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు అనేది సలార్ విషయంలో వినిపిస్తున్న మైనస్. 

ఇదిలా ఉంటే సలార్ సక్సెస్ పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ కి కారణమైంది. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్ ఒకరు '' ప్రభాస్ ని కరెక్ట్ గా వాడుకుంది రాజమౌళి, ప్రశాంత్ నీల్... ఎన్టీఆర్ ని కరెక్ట్ గా వాడుకుంది రాజమౌళి, వివి వినాయక్... అల్లు అర్జున్ ని కరెక్ట్ గా వాడుకుంది సుకుమార్, త్రివిక్రమ్... మహేష్ బాబును కరెక్ట్ గా వాడుకుంది పూరి జగన్నాధ్... పవన్ కళ్యాణ్ ని కరెక్ట్ గా వాడుకుంది చంద్రబాబు నాయుడు'' అని కామెంట్ పోస్ట్ చేశాడు. 

ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండేలా చేసింది. కామెంట్స్ రూపంలో తమ అసహనం బయటపెడుతున్నారు. సదరు ట్వీట్ ని ట్యాగ్ చేసిన రామ్ గోపాల్ వర్మ నమస్కారం ఎమోజీ పోస్ట్ చేశాడు. ఇది మామూలు ట్రోల్ కాదు అన్న అర్థం వచ్చేలా వర్మ ట్విట్టర్ పోస్ట్ ఉంది. వర్మ స్పందించిన కారణంగా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. చాలా మందికి రీచ్ అయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మను బూతులు తిడుతున్నారు. 

ప్రభాస్ హిట్ కొడితే... పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ట్రోల్స్ కి గురయ్యారు. మరి కొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. వచ్చే ఏడాది ఎన్నికల అనంతరం తిరిగి చిత్రీకరణ జరుపుకోనున్నాయి. 

Scroll to load tweet…