బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సృష్టం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా తిరుమల శ్రీవారి దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికవ్వడం ఖాయమని అని  దేశ వ్యాప్తంగా బీజేపీ బలంగా ఉందని, గత ఎన్నికల ఫలితాలే మరోసారి పునారావృత్తం అవుతాయని కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. 

గతంలో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన విషయం తెలిసిందే. కాగా పోటీ సిద్దంగా ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ఆయన ప్రకటించారు. ఈ నేపధ్యంలో కృష్ణం రాజు పవర్ లోకి రావటానికి ప్రభాస్ ఏ మాత్రం ఉపయోగపడతారనే అంశం చర్చకు వస్తోంది. ప్రభాస్ ప్రచారానికి వస్తాడనే ఉద్దేశ్యంతో కృష్ణంరాజుకు సీటు కేటాయిస్తారని చెప్పుకుంటున్నారు. 

బాహుబలి చిత్రంలో ప్రభాస్ స్టార్ డమ్ ఎక్కడికో వెళ్లింది. అంతర్జాతీయంగానూ ఆయనకు ప్రశంసలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రభాస్ పబ్లిసిటీ చేస్తే కృష్ణం రాజు ఖాయమని అంటున్నారు. ప్రభాస్ స్టార్డమ్ ఖచ్చితంగా కృష్ణంరాజుకు ఉపయోగపడుతుందంటున్నారు. అయితే ప్రభాస్ ..బయిటకు వచ్చి ఎలక్షన్ క్యాంపైన్ లో పాల్గొంటాడా అనేదే ప్రశ్నార్దకం. కానీ తన పెదనాన్న అంటే ప్రేమ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాడని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వస్తే కనక ప్రభాస్ ప్రచారం..బిజేపీకు ప్లస్ అవుతుందనటంలో సందేహం లేదు.