Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఇంట్లో వాళ్లకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడట

  • రాఖీ పండగ సందర్భంగా ప్రభాస్ సహోదరి
  • ఇంట్లో వుంటే పెళ్లి గురించి అడుగుతారని తప్పించుకు తిరుగుతున్నాడన్న సోదరీమణులు
  • సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఎన్నో ఇచ్చే  అన్నయ్య దొరకడం లక్కీ అంటున్న ప్రభాస్ సిస్టర్స్
prabhas sisters also dont know about his marriage

బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరో ప్రభాస్ కృష్ణంరాజు వారసునిగా వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి, సాయి ప్రసీద ముగ్గురు కుమార్తెలు ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆ కుటుంబంలో ఒక్కగానొక్క వారసుడు ప్రభాస్. తన పెదనాన్న కూతుళ్లైన చెల్లెళ్లను ప్రభాస్ చాలా ప్రేమగా చూసుకుంటాడట. రక్షాబంధన్ సందర్భంగా ప్రభాస్ సోదరి సాయి ప్రకీర్తి ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అన్నయ్య మాతో చాలా క్లోజ్ గా ఉంటారు. సినిమాల షూటింగ్స్‌లో గ్యాప్ దొరికితే ఎక్కువ సమయం మాతో గడపడానికి ఇష్టపడతారు. మేమంటే ఆయనకు ఎంత ప్రేమో, ఆయనంటే మాకు అంత గౌరవడం. మా ఇష్టాలను గౌరవిస్తాడు. ఫారెన్‌కు వెళ్తే మా ఇష్టాలను తెలుసుకొని సర్ప్రైజ్ గిఫ్టులు గుర్తుపెట్టుకొని మరీ తీసుకొస్తుంటాడు. అందరిలానే మేము కూడా అన్నయ్య పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాం. ఇంట్లో పెళ్లి గురించి అడుగుతున్నారనే సినిమా షూటింగులని చెప్పి విదేశాల్లో తిరుగుతున్నాడని అన్నారు.


ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వలన పెళ్లి ఎప్పుడు జరుగుతుంది, ఏరోజున జరుగుతుందనే విషయాలు మాకు కూడా తెలియడం లేదని అన్నారు. అలానే అన్నయ్య చాలా వ్యక్తి అని, తమ జీవితంలో చూసిన ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్‌లో అన్నయ్య ఒకరని, తను మాకు అన్నయ్యగా దొరకడం మా అదృష్టమని తమతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios