బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చాడు ప్రభాస్. అవును షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకు కలెక్షన్ల కరెంట్ షాక్ ఇచ్చింది కల్కి సినిమా. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా... యంగ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కల్కి. భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కల్కి.. మొదట ప్లాప్ టాక్ వచ్చినా... ఆతరువాత చిన్నగా పికప్ అందుకుని. పరుగులు పెడుతోంది. రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా.. కల్కి జోరు ఏమాత్రం తగ్గడంలేదు. అంతే కాదు ఈసినిమాకు పోటీ ఇచ్చే మరో పెద్ద సినిమా లేకపోవడంతో కల్కి ఊపు మరింత పెరిగిపోయింది. 

ఇక ఇప్పటికే కల్కి సినిమా 1000 కోట్ల క్లబ్ లో సునాయాసంగా చేరిపోయింది. అంతే కాదు.. మరో వారం కాని రెండు వారాలు కాని కల్కి ఇదే ఊపుతో నడిస్తే.. 100 నుంచి 200 కోట్ల వరకూ కలెక్ష్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన కల్కి సినిమా ఫైనల్ రన్ లో 1200 కోట్లకు పైగా వసూలు చేసినా.. ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. ఇక ఇది ఇలా ఉంటే.. రికార్డ్ లు బ్రక్ చేసే పని మొదలు పెట్టింది కల్కి సినిమా. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఖాతాలో ఉన్న రికార్డ్ ను తిరిగిరాసింది. 

భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం బుక్ మై షోలో షారుఖ్ ఖాన్ రికార్డ్‌ను బ‌ద్ద‌లుకొట్టింది. ప్ర‌ముఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో అత్యధిక టికెట్లు బుక్ చేసుకున్న తొలి ఇండియన్ సినిమాగా కల్కి 2898 AD రికార్డు సృష్టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ న‌టించిన జవాన్ పేరు మీద ఉంది. ఈసినిమా 12.01 మిలియ‌న్ టికెట్ల తో మొదటి ప్లేస్ లో ఉండగా.. తాజాగా ఈ రికార్డును క‌ల్కి క్రాస్ చేసింది. రానున్న రోజుల్లో కూడా కల్కికి ఎదురోచ్చే సినిమాలు లేకపోవడంతో.. ఈమూవ కలెక్షన్లు అనుకున్నదానికంటే పెరిగే అవికాశం ఉంది.