ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భారీ పోటీ నెలకొంది.
ఓవర్సీస్ లెక్కలు మారిపోయాయి. ఒకప్పటి క్లాస్ సినిమాలే ఆడతాయనే సీన్ అక్కడ లేదు. బి.సి సెంటర్ల ప్రేక్షకులు తరహాలో ఓవర్ సీస్ లో సినిమాలను హిట్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలు సైతం అక్కడ భీబత్సం చేస్తున్నాయి. ముఖ్యంగా మాస్ కు అక్కడ ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. నాని దసరా సినిమాకు అక్కడ మంచి ఓపినింగ్స్ వచ్చాయి. కలెక్షన్స్ బాగున్నాయి. ఈ నేపధ్యంలో మాస్ సినిమా అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహపడుతున్నారు. అలాంటి రాబోయే మాస్ సినిమాల్లో ఒకటి సలార్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. కె.జి.యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే చెప్పేసి ఉన్నారు. ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై ఉన్న అంచనాలతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భారీ పోటీ నెలకొంది.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు.. ‘సలార్’ మూవీ ఓవర్ సీస్ హక్కుల విషయంలో ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. దీంతో మేకర్స్ ఈ మూవీ ఓవర్ సీస్ హక్కుల కోసం ఏకంగా రూ.70 కోట్లు ఫిక్స్ చేశారని సమాచారచం. అంటే సలార్ ఓవర సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా 9 మిలియన్ డాలర్స్‌ను రాబట్టాల్సి ఉంటుంది. బాహుబలి సినిమా కె.జి.యఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ రేంజ్ రేట్ ఓవర్ సీస్ రైట్స్‌కు ఫిక్స్ చేశారు. ఈ క్రేజ్ కు కారణం.. ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ అని ట్రేడ్ వర్గాలు సమాచారం.
ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా గురించి మాట్లాడుతూ ఏ సినిమాలో ప్రభాస్ ని ఇంతవరకు ఎప్పుడు చూపించని విధంగా చూపిస్తున్నట్లు చెప్పారు . చాలా నమ్మకంగా చెబుతున్నాను కానీ ఆయన సలార్ సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పాడు. ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని సినిమాలో నేను చాలా క్రూరంగా కనిపిస్తానని చెప్పాడు. ఇలాంటి పాత్రలు ఇంతకుముందు ఎప్పుడూ నటించలేదు అని ఆయన చెప్పారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా ‘సలార్’ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో జగపతి బాబు, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలుగా ఉంటుందనే టాక్ అయితే సినీ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపించింది.
