పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ స్వతహాగా ఇంట్లో తయారు చేయించిన పంపించన ఫుడ్‌పై బిగ్‌బీ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఫన్నీ గా ఓ పంచ్ కూడా వేశారు.
ప్రభాస్(Prabhas)పై మరోసారి ప్రశంసలు కురిపించారు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) . ప్రభాస్ పెట్టిన ఫుడ్ జీర్ణించుకోలేని విధంగా ఉందంటూ తెలిపారు ఈ మేరకు ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్. ప్రభాస్.. తన సినిమాల్లో నటించిన స్టార్ యాక్టర్స్ కి, హీరోయిన్లకి తన ఇంటి భోజనం పెట్టడం అలవాటు. ఇప్పటికే నటి భాగ్యశ్రీ, అలాగే శ్రద్ధా కపూర్, కృతిసనన్, దీపికా పదుకొనె లు ప్రభాస్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభాస్ వంటకాలకు ముగ్గులైన వారు ప్రశంసలు కురిపించారు.
తాజాగా అమితాబ్ బచ్చన్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా తయారు చేసిన ఇంటి ఫుడ్‌ని పంపించారు. స్వతహాగా ఇంట్లో తయారు చేయించిన వంటకాలను Amitabhకి పంపడంతో ఆయన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎక్కువ మోతాడులో ఈ వంటకాలు పంపడం చూసిన అమితాబ్.. Prabhasపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రభాస్ వంటకాలను ప్రత్యేకంగా అభినందించారు.
`బాహుబలి ప్రభాస్ నీ దాతృత్వం అతీతమైనది. మీరు నాకు ఇంటి నుంచి వండి పంపించిన ఆహారం ఎంతో రుచికరంగా అద్భుతంగా ఉంది. ఇంతటి ఎక్కువ పరిమాణంలో పంపి ఆర్మీకి తిండి పెట్టగలని ప్రత్యేక వంటకాలు రెడీ చేశారు. మీరు పెట్టిన ఫుడ్ కి అభినందనలు. అయితే ఇది నేను జీర్ణించుకోలేని విధంగా ఉంది` అంటూ ఫన్నీ, సెటైరికల్ ఎమోజీని షేర్ చేశారు అమితాబ్. వివిధ రకాల రుచికరమైన వంటకాలను ఎక్కువ మోతాదులో పంపిన కారణంగా తాను వీటిని తినలేనని, అవి తనకు అరగవనే అర్థంతో అమితాబ్ ప్రభాస్‌పై పంచ్‌లు వేయడం విశేషం. ప్రస్తుతం బిగ్‌బీ ట్వీట్ వైరల్‌గా మారింది.
మరోవైపు అంతకు ముందు ప్రభాస్‌తో కలిసి నటించడంపై అమితాబ్ ట్వీట్ చేశారు. ప్రభాస్‌తో కలిసి నటించడం గౌరవంగా ఉందన్నారు. `ఫస్ట్ డే, ఫస్ట్ షా, ఫస్ట్ ఫిల్మ్ ప్రభాస్‌తో, పెద్దలపై ఆయన వినయం, పనిపై ప్రభాస్ అంకితభావం, నటనలో ఆయన ప్రతిభపాటవాలు నన్ను కట్టిపడేశాయి. అలాంటి వ్యక్తితో నటించడం నిజంగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా` అని అమితాబ్ పోస్ట్ చేశారు.
ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం `ప్రాజెక్ట్ కే`(Project K). `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఏకంగా దాదాపు ఐదు వందల కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ని ఈ సినిమా పూర్తి చేసుకోగా, గత వారం నుంచి రెండో షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా, ప్రభాస్ పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే అమితాబ్ గతంలో తెలుగులో `మనం`, `సైరా` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
