సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అయినా ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ తో వస్తోన్న స్పందన చూసి షాక్ అవుతున్నారు.
ప్రభాస్ క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘సలార్’హైప్ ఓ రేంజిలో ఉంది . నిన్నటి నుంచి టికెట్ల కోసం థియేటర్స్ దగ్గర అభిమానులు వందలాదిగా బారులు తీరారు.లార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో మూవీని ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకి అందిస్తున్నారు. అన్ని చోట్ల సినిమాకి భారీ క్రేజ్ ఉంది. కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ చిత్ర టీమ్ లో ఉంది. సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అయినా ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ తో వస్తోన్న స్పందన చూసి షాక్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యిందో ఏరియావైజ్ చూస్తే...
👉నైజాం – మైత్రీ మూవీ మేకర్స్
👉తమిళనాడు – రెడ్ జెయింట్ ఫిల్మ్స్
👉కర్ణాటక – KRG స్టూడియోస్
👉కేరళ – పృధ్వీరాజ్ ప్రొడక్షన్స్
👉భారత్ లో మిగతా ప్రాంతాలు(హిందీ) – AA ఫిల్మ్స్ (Anil Thadani)
👉నార్త్ అమెరికా – Pratyangira Cinemas
👉మిగతా ఓవర్ సీస్ – Phars Films(ఇండిడ్యువల్ డిస్ట్రిబుటర్స్)
ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం Rs.65 Cr
సీడెడ్ (AP) Rs.27 Cr
ఆంధ్రా (AP) Rs.71 cr
కర్ణాటక Rs.50 Cr
కేరళ Rs.12 Cr
తమిళనాడు Rs.30 Cr
నార్త్ ఇండియా Rs.125 Cr
ఓవర్ సీస్ Rs.72 Cr
థియోటర్ మొత్తం బిజినెస్ Rs.452 cr
నాన్ థియోటర్ రైట్స్ బిజినెస్ Rs.230 Cr
*ఓవరాల్ బిజినెస్ Rs.680 Cr
‘ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది.. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం’ అనే డైలాగుతో వచ్చిన #Salaar ట్రైలర్‌ను ఓ రేంజిలో పేలింది. ప్రభాస్, పృధ్వీరాజ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారు..వారు ఏం చేస్తూంటారు. తన ప్రాణ స్నేహితుడు కోసం ప్రభాస్ ఏం చేస్తాడు వంటి విషయాలతో నడుస్తూ ,వారిద్దరూ, బద్ధ శత్రువులుగా మారడంతోనే సలార్ పార్ట్ 1 ముగిసే అవకాశం ఉంది. పార్ట్ 2లో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య పోరును చూపిస్తారు దర్శకుడు అని ట్రైలర్ చూసిన వారికి అర్దమైంది. అలాగే ట్రైలర్ లో విజువల్స్ చూసే వారికి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని తెలిసిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే లెక్కలు మీడియాలో,ట్రేడ్ లో మొదలయ్యాయి.
ఈ చిత్రం మొదటిరోజు అంటే డిసెంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా రూ. 150 నుంచి 160 కోట్ల గ్రాస్‌ను #Salaar ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే #Salaar మొదటి వారం రూ. 500 నుంచి 600 కోట్ల గ్రాస్, ఓవరాల్‌గా రూ. 1200 కోట్ల పై చిలుకే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది (వరల్డ్‌వైడ్ అన్ని భాషల్లో కలిపి) అని అంచనా. ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ఈ ఫిగర్స్ ని రీచ్ అయ్యిపోవచ్చు.
డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’ . ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
