Asianet News TeluguAsianet News Telugu

#Salaar కలెక్షన్స్ తో ‘డుంకీ’ని పోల్చద్దంటూ ...

 బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డుంకీ’ సినిమా కూడా ‘సలార్’తో పాటే విడుదల అవుతోంది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎమోషనల్ డ్రామా 

Prabhas Salaar will try to compare 5 language collections with Dunki Hindi ?  jsp
Author
First Published Dec 18, 2023, 8:32 AM IST


ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ మూవీ విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ చిత్రం డిసెంబర్‌ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్‌ అవుతోంది. సలార్‌ను కేజీఎఫ్‌ చిత్రాలను నిర్మించి కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తెరకెక్కించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భార సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుంది. అలాగే  బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డుంకీ’ సినిమా కూడా ‘సలార్’తో పాటే విడుదల అవుతోంది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎమోషనల్ డ్రామా థియేటర్లలో అలరించబోతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు హాలీవుడ్ మూవీ ‘అక్వామ్యాన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఖచ్చితంగా సలార్ కు డుంకీ కు మధ్యన పోటీ ఉంటుందని అంచనా వేసారు. ఫ్యాన్స్ కూడా అలాగే చూస్తున్నారు. అయితే ఇది సరికాదు అంటోంది  బాలీవుడ్ మీడియా ,షారూఖ్ ఫ్యాన్స్. 

సలార్ కన్నా ఒక రోజు ముందు వస్తున్న  ‘డుంకీ’ అంచనాలు బాగానే ఉన్నాయి కానీ సలార్ చిత్రం యాక్షన్ ప్యాకెడ్ కావటంతో దీని ముందు తేలిపోతోంది.  మరో ప్రక్క ఈ సినిమాని కేవలం హిందీ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లోకి డబ్ చేయాలనుకున్నారు కానీ లాస్ట్ మినిట్ లో వెనక్కి తగ్గారు. తమ సినిమాలో చర్చిస్తున్నది రీజనల్ సమస్య కాబట్టి ప్యాన్ ఇండియా రిలీజ్ అనవసరం అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేవలం హిందీ వెర్షన్ లో మాత్రమే రిలీజ్ అవుతున్న డింకీ కలెక్షన్స్ ని, సలార్  కలెక్షన్స్ తో సరిచూడదు అని ఇప్పటినుంచే అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. అంతగా అయితే సలార్ హిందీ వెర్షన్, డింకీ హిందీ వెర్షన్ కలెక్షన్స్ చూసి పోల్చుకోవాలని చెప్తున్నారు. రిలీజ్ కు ముందే పోటీ నుంచి తప్పుకుంది డింకీ, ఇప్పుడు పోల్చద్దు అని పోస్ట్ లు పెట్టడం కామెడీ ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక షారుఖ్  ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలు 'జవాన్', 'పఠాన్', తర్వాత ఇప్పుడు తన రాబోయే చిత్రం డుంకీపై భారీ అంచనాలను కలిగి ఉన్నాడు.  షారూఖ్ ఖాన్'కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. మొదటిసారిగా, SRK హిందీ సినిమా బెస్ట్ డైరక్టర్ లలో  ఒకరైన రాజ్‌కుమార్ హిరానీ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో SRK సరసన తాప్సీ పన్ను కూడా నటించింది. ప్రేక్షకులు ఆదరిస్తున్న కొత్త జంట. వీరితో పాటు విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, సతీష్ షా, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

అలాగే ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ప్రేక్షకుల్లో ఏ రేంజ్ క్రేజ్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ ‘కేజీయఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండంతో ‘సలార్’ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశం హద్దు అనే లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా  పూర్తి యాక్షన్ ఎంటర్‌‍టైనర్‌ రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను అల్టిమేట్‌గా డిజైన్ చేశాడట ఈ క్రేజీ డైరెక్టర్. ఈ క్రమంలో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు, సినీ లవర్స్  ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దాంతో రిలీజ్ రోజు ఓపినింగ్స్ అదిరిపోతాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios