Asianet News TeluguAsianet News Telugu

నిజమా? ‘సలార్‌’ కి నక్సల్స్ భయం? భారీ భద్రత


‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ కు  ‘సలార్‌’  నెక్ట్స్ లెవిల్ ఫిల్మ్‌. ‘కె.జి.ఎఫ్‌’తో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, నిర్మాత విజయ్‌ కిరంగందూర్‌ జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురి  కలయికలో రూపొందనున్న మరో పాన్‌ ఇండియా చిత్రమే... ‘సలార్‌’. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వద్ద, ప్రభాస్ ఉంటున్న గెస్ట్ హౌస్ వద్ద భారీ భద్రత  ఉంది. అందుకు కారణం అది నక్సలైట్ల ప్రభావిత ప్రాంతమని, వారి నుంచి థ్రెట్ ఉంటుందని భయమని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అయితే అందులో నిజమెంత?

Prabhas Salaar Under Naxals Threat? jsp
Author
Hyderabad, First Published Feb 2, 2021, 1:04 PM IST

వివరాల్లోకి వెళితే.. ప్రభాస్‌ నటిస్తున్న ‘సలార్‌’ సినిమా షూటింగ్ పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ ప్రాంతంలో సందడి నెలకొంది. ఇక్కడే పది  రోజులు పాటు షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక్కడ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.  ‘సలార్’‌ సినిమా రామగిరి మండలం ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. బొగ్గు గని ప్రాంతంలో ఫైట్‌ సీన్లను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు దగ్గర ఓ సెట్టింగ్‌  ను వేసింది చిత్రయూనిట్. ఈ నేపధ్యంలో పోలీస్ లు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

ఈ నేపధ్యంలో మీడియాలో రకరకాల వార్తలు స్రెడ్ అవుతున్నాయి. సలార్‌ మూవీ షూటింగ్‌ నేపథ్యంలో నక్సలైట్ల కదలికల విషయమై పోలీసులకు సమాచారం అందిందని.. ఆ కారణంగానే దాదాపుగా యాభై మంది పోలీసులతో పాటు మరో 20 నుండి 30 మంది వరకు ప్రైవేట్‌ సెక్యూరిటీ వారిని కూడా షూటింగ్‌ స్పాట్‌ లో భద్రత కోసం నియమించినట్లుగా చెప్తున్న్రారు. అయితే కొత్తగూడెం ఎస్పీ స్వయంగా సలార్‌ షూటింగ్‌ సెక్యూరిటీ విషయాన్ని పర్యవేక్షించటం మాత్రం నిజమే అని తెలుస్తోంది. 

అయితే నక్సలైట్ల మ్యాటర్ ఏమీ లేదని, ఇలాంటి పెద్ద హీరోల సినిమాలకు మాములుగానే సెక్యూరిటీ అనేది తీసుకుంటారని సినిమావాళ్లు అంటున్నారు. అలాగే ప్రెవేట్ సెక్యూరిటీ సైతం చాలా కామన్ థింగ్ అని చెప్తున్నారు. ముఖ్యంగా అభిమానుల తాకిడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వారిని కంట్రోలు చేసేందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని, అంతకు మించి వేరేదేమీ కాదని చెప్తున్నారు. 
 
ఇక ప్రభాస్‌ ని చూసేందుకు ఎక్కడెక్కడ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. షూటింగ్‌ను తిలకించేందుకు కరీంనగర్‌, గోదావరిఖని, పన్నూరు, లద్నాపూర్‌, నాగేపల్లి, రాజాపూర్‌, సెంటినరీకాలనీ, కమాన్‌పూర్‌, మంథని, పెద్దపల్లి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రామగుండం అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) సంజీవ్‌, మంథని సీఐ మహేందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ముందుజాగ్రత్తగా ఎవరినీ షూటింగ్‌ స్పాట్‌కు రాకుండా చర్యలు తీసుకున్నారు. 
   

ఇక గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లెందు  గెస్ట్ హౌస్ లో బస చేసిన ప్రభాస్‌ను రామగుండం సీపీ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి  నేరుగా పోలీసులు, బౌన్సర్ల బందోబస్తు మధ్య గోదావరిఖని చౌరస్తా, ఫైవింక్లైయిన్‌కాలనీ మీదుగా ప్రత్యేక వాహన శ్రేణిలో రామగిరి మండలం సెంటినరీకాలనీలోని సింగరేణి ఆర్జీ-3లోని రెండో ఉపరితల గని(ఓసీపీ-2)కు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌, చిత్ర యూనిట్ తో కలిసి చేరుకున్నారు.  5నాలుగు రోజులుగా ఉపరితల గనుల్లో నిర్మించిన సెట్‌లో కాకుండా వర్క్‌షాప్‌లో ఉన్న 5 భారీ హైడ్రాలిక్‌ డంపర్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేసారు. 
 
ప్రభాస్‌ మెకానిక్‌ గెటప్‌లో మాస్‌లుక్‌తో డంపర్‌లున్న వర్క్‌షాప్‌ నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న యాక్షన్‌ ఛేజింగ్‌ సన్నివేశాలను ప్రశాంత్‌నీల్‌ షూట్ చేసారు.  అనంతరం ప్రభాస్‌ గోదావరిఖనిలోని ఇల్లెందు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios