ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న మరో పాన్‌ ఇండియా చిత్రం `సలార్‌`. `కేజీఎఫ్‌` దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. `కేజీఎఫ్‌` సినిమాని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగుదూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌లో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇందులో విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించబోతున్నారనే వార్త తెగ వైరల్‌ అవుతుంది. దీంతోపాటు తెలంగాణలో షూటింగ్‌ జరుపుకోబోతుందట. రామగుండంలో ఉన్న సింగరేణి ఓపెన్‌ కాస్ట్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిపేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ 2 లో భారీ యాక్షన్‌ సీన్స్ షూట్‌ చేస్తారని టాక్‌. దాదాపు పది రోజులపాట ఈ షెడ్యూల్‌ ఉంటుందట. ప్రస్తుతం సెట్‌ వర్క్ జరుగుతుందని, అది పూర్తి కాగానే రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలెడతారని ఫిల్మ్ నగర్‌ సమాచారం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. 

మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ ఇది. ఇందులో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు హిందీ సినిమా `ఆదిపురుష్‌` సినిమాని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటిస్తున్నారు. రాముడిగా ప్రభాస్‌ కనిపిస్తారు. ఇదిలా ఉంటే ఇందులో ప్రభాస్‌ సోదరుడుగా, లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు టైగర్‌ష్రాఫ్‌ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. సీత పాత్రలో కృతి సనన్‌ పేరు వినిపిస్తుంది.