'దేవర'తో #Salaar పోటీ పడనుందా?పరిష్కారం ఇదే
కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో భయం అనే భావోద్వేగంతో ఈ కథని రెండు భాగాలుగా చెబుతున్నామన్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
పెద్ద సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరమే. అందుకే పండగ సీజన్ సినీ ప్రేమికులకు ఇష్టమైన వారాలుగా మారిపోతూంటాయి. దసరా,సంక్రాంతి మాత్రమే కాకుండా పెద్ద సినిమా రిలీజ్ టైమ్ సైతం ఆ హంగామా,హడావిడి కనపడుతూంటుంది. అయితే రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ కు పెట్టడానికి ఇష్టపడరు మేకర్స్. అందులోనూ డైనోసార్ తో పోల్చుతున్న సలార్ వంటి సినిమాలతో పోటీపడటానికి షారూఖ్ వంటి స్టార్ సైతం వెనకడుగు వేసి తన రిలీజ్ డేట్ ముందు రోజుకు జరుపుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్ పార్ట్ 1 - సీజ్ ఫైర్' చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నారు. అలాగే 'దేవర' సినిమా కూడా రెండు పార్ట్ లుగా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విస్తృతమైన కథను, బలమైన పాత్రల్ని, వాటి భావోద్వేగాల్ని పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు తెలిపారు. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో భయం అనే భావోద్వేగంతో ఈ కథని రెండు భాగాలుగా చెబుతున్నామన్నారు. తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
అయితే ఇక్కడే ట్విస్ట్ పడనుంది అంటున్నారు. #Salaar Part 2 థియేటర్స్ లోకి ఏప్రియర్ 2024 రానుంది. వేసవి సీజన్ ని క్యాష్ చేసుకోవటానికి ఈ డేట్ ఉపయోగపడుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అఫీషియల్ గా పార్ట్ వన్ ఎండ్ క్రెడిట్స్ ప్రకటించనున్నారు. ఇది ఇలాగే అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరిగి పార్ట్ 2 ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో గనుక విడుదల చేస్తే... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడాల్సి వస్తుంది. దేవర సినిమాపై కూడా భారీ ఎత్తునే అంచనాలు ఉన్నాయి.
అయితే రెండు వారాలు తేడా అయితే పెద్దగా ఇబ్బంది ఉండదనేది నిజం. ఎందుకంటే మొదటి వారంలోనే మాగ్జిమం థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు. దాంతో ఎక్కడెక్కడ సినీలవర్స్,అభిమానులు చూసేస్తున్నారు. మిగిలిన వాళ్లు సెకండ్ వీక్ నుంచి చూస్తున్నారు. అప్పుడు రెండో వారం దాటితే ఎంత పెద్ద హిట్టైనా అన్ని థియేటర్స్ అవసరం ఉండదు. కాకపోతే మంచి థియేటర్స్ ఏ సినిమాకు వెళ్తాయనేది చూసుకోవాల్సిన విషయం. ఏదమైనా ఒకే నెలలో రెండు పెద్ద సినిమాలు వస్తే ఆ క్లాష్ కావడం వల్ల థియేటర్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరో ప్రక్క సలార్ పార్ట్ 2 షూట్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని వినికిడి.