Salaar:సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.. డైనోసార్ లాంటి కటౌట్ తో భీకరంగా ప్రభాస్
రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ లో సలార్ మానియా పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ లో ప్రభాస్ మాస్ విశ్వరూపం చూసి తరించాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం సలార్. ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల విడుదలైన టీజర్ కి థండర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ ప్రశాంత్ నీల్ క్రేజీ ఎలివేషన్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా రిలీజ్ రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ లో సలార్ మానియా పెరుగుతోంది. ప్రశాంత్ నీల్ స్టైల్ లో ప్రభాస్ మాస్ విశ్వరూపం చూసి తరించాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. సలార్ చిత్రం మరోసారి వాయిదా పడుతుందా అనే అనుమానాలు చర్చలు గత వారం రోజులుగా జరిగాయి. దీనితో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు అనుమానాల్ని చిత్ర యూనిట్ పటాపంచలు చేసేసింది.
ఇక డౌటే లేదు.. సలార్ టెరిటరీ లోకి డైనోసార్ దిగిపోతున్నాడు. తాజాగా ట్రైలర్ అప్డేట్ తో అనుమానాలన్నీ తీర్చేశారు. సలార్ ట్రైలర్ ని డిసెంబర్ 1న సాయంత్రం 7.19 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. దీనితో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా సలార్ హీట్ పెరిగింది. సలార్ చిత్రం ట్రెండింగ్ గా మారింది.
గూస్ బంప్స్ తెప్పించే పోస్టర్ తో ట్రైలర్ రిలీజ్ అనౌన్సమెంట్ చేశారు. ప్రభాస్ జీప్సి పై ఎక్కి పవర్ ఫుల్ గౌన్ తో శత్రువులని చెండాడుతున్న పోస్టర్ అది. ఈ పోస్టర్ లో ప్రభాస్ భీకరంగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.సలార్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సలార్ కేస్ ఫైర్ గా రిలీజ్ అవుతోంది.