యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో నటించాలని ఎవరికి ఉండదు. అయితే ఆ అవకాసం అందరికీ రాదు. కానీ ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకు, టాలెంట్ ఉన్నవాళ్లకు ఆ అవకాసం ఇస్తానంటున్నారు దర్శకులు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న అనేక భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో   ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఈ సినిమా అనౌన్స్ చెయ్యడంతో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున అటెన్షన్ ను సంతరించుకున్న దాంట్లో ఏ మాత్రం అబద్దం లేదు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించారు.

 ఈ నెల 15న హైదరాబాద్‌, శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనున్న ‘సలార్‌’ ఆడిషన్‌ కోసం ఆసక్తి ఉన్నవారు వన్‌ మినిట్‌ వీడియోతో(ఏ భాష అయినా పర్వాలేదు) హాజరు కావాలని వెల్లడించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ ఆడిషన్స్‌ జరగనున్నాయి. త్వరలో బెంగళూరు, చెన్నైల్లోనూ ఆడిషన్స్‌ జరగనున్నాయని దర్శకుడు తెలియజేశారు. ఇక ఈ సినిమా టైటిల్ అర్ధం ఏమిటి అని ఆలోచించగా దర్శకుడు నీల్ రివీల్ చేసారు. సలార్ అంటే ఒక రాజుకు రైట్ హ్యాండ్ అని చెప్పాడు.
 
‘మోస్ట్‌ వయోలెంట్‌ మ్యాన్‌.. కాల్డ్‌ వన్‌ మ్యాన్‌... ది మోస్ట్‌ వయోలెంట్‌.. సినిమా మీద ప్రేమతో భాషల హద్దులను చెరిపేస్తూ.. భారతీయ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ప్రభాస్‌ గారికి హృదయపూర్వక స్వాగతం’ అంటూ ప్రశాంత్ నీల్ పోస్టులో పేర్కొన్నారు.  హొంబెల్‌ ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. కేజీఎఫ్‌,  కేజీఎఫ్‌ 2ను నిర్మించిన విజయ్‌ కిరుగందుర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ వెనుక ఉన్న హోంబాలే చిత్రాలు ఈ చిత్రాన్ని బ్యాంక్రోలింగ్ చేస్తున్నాయి.
 
ఇక గతంలో కన్నడ లో ప్రశాంత్ నీల్ చేసిన ఉగ్రం అనే సినిమా సూపర్ హిట్. ఆ సినిమానే ఇప్పుడు ప్రభాస్ తో తీస్తాడని వార్తలు వస్తున్నాయి. 2014లో విడుదలైన ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. అందులో హీరో కూడా ఒక గ్యాంగ్ లీడర్ గానే కనిపిస్తాడు. ఫ్యామిలీ యాంగిల్ కూడా కలగలపి ఉండే కంప్లీట్ మాస్ చిత్రం ఉగ్రం. ఆ స్క్రిప్టుకే కాస్తంత మెరుగులు దిద్ది ప్రబాస్ తో చేయబోతున్నాడని చెప్తున్నారు.
 
 సలార్‌ సినిమాలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జవవరిలో సలార్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.‘మేం ప్రస్తుతం చేస్తున్న ‘కేజీయఫ్‌ 2’ మీద చాలా అంచనాలు ఉన్నాయని తెలుసు. వాటన్నింటినీ మించేలా ఈ సినిమా ఉంటుంది. అలానే మా తదుపరి సినిమా కూడా ప్యాన్‌ ఇండియన్‌ సినిమాయే. అన్నారు.