యూఎస్ లో ఒకరోజు ముందే... కనీవినీ ఎరుగని స్థాయిలో సలార్ రిలీజ్!
సలార్ మూవీకి ఉన్న డిమాండ్ నేపథ్యంలో యూఎస్ లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ చేసిన ప్రకటన మైండ్ బ్లాక్ చేస్తుంది.

సలార్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కాగా యూఎస్ లో సలార్ ఒకరోజు ముందే విడుదల కానుంది. 27న ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. ఏకంగా 1979 లొకేషన్స్ లో సలార్ విడుదల చేస్తున్నారు. గతంలో ఈ ఇండియన్ మూవీ ఇంత భారీ ఎత్తున విడుదల కాలేదు. సలార్ ఖాతాలో ఇది ఒక రికార్డు అని చెప్పొచ్చు. ఈ క్రమంలో యూఎస్ లో సలార్ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండే అవకాశం కలదు. కాగా సలార్ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ విషయాన్ని నటుడు జగపతిబాబు వెల్లడించారు.
సలార్ మూవీలో జగపతి కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్ ఇచ్చాడు. మూవీలో తన పాత్రపై ఆసక్తికర విషయం బయటపెట్టారు. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందట. పార్ట్ 1లో తనకు ప్రభాస్ కి మధ్య ఎలాంటి కాంబినేషన్ సీన్స్ ఉండవట. పార్ట్ 2లో మాత్రంలో మా ఇద్దరి కాంబోలో అదిరిపోయే సన్నివేశాలు ఉంటాయని జగపతిబాబు చెప్పుకొచ్చారు.
కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన సలార్ టీజర్ గత చిత్రాల రికార్డ్స్ బద్దలు కొట్టింది. తక్కువ సమయంలో వంద మిలియన్ వ్యూస్ దాటేసింది. సలార్ చిత్రంపై జనాల్లో ఉన్న క్రేజ్ కి ఇదే నిదర్శనం.
సలార్ విడుదలైన మూడు నెలల్లో ప్రాజెక్ట్ కే విడుదల కానుంది. ప్రభాస్ నటిస్తున్న ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జులై 20న శాన్ డియాగో కామిక్ కామ్ ఈవెంట్ వేదికగా సలార్ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ కే మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడు. కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.