ట్రైలర్ లో విజువల్స్ చూసే వారికి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని తెలిసిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే లెక్కలు మీడియాలో,ట్రేడ్ లో మొదలయ్యాయి.
‘ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది.. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం’ అనే డైలాగుతో వచ్చిన #Salaar ట్రైలర్‌ను ఓ రేంజిలో పేలింది. ప్రభాస్, పృధ్వీరాజ్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు ఎలా అయ్యారు..వారు ఏం చేస్తూంటారు. తన ప్రాణ స్నేహితుడు కోసం ప్రభాస్ ఏం చేస్తాడు వంటి విషయాలతో నడుస్తూ ,వారిద్దరూ, బద్ధ శత్రువులుగా మారడంతోనే సలార్ పార్ట్ 1 ముగిసే అవకాశం ఉంది. పార్ట్ 2లో ఈ ఇద్దరు స్నేహితుల మధ్య పోరును చూపిస్తారు దర్శకుడు అని ట్రైలర్ చూసిన వారికి అర్దమైంది. అలాగే ట్రైలర్ లో విజువల్స్ చూసే వారికి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని తెలిసిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే లెక్కలు మీడియాలో,ట్రేడ్ లో మొదలయ్యాయి.
ఈ చిత్రం మొదటిరోజు అంటే డిసెంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా రూ. 150 నుంచి 160 కోట్ల గ్రాస్‌ను #Salaar ఈజీగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే #Salaar మొదటి వారం రూ. 500 నుంచి 600 కోట్ల గ్రాస్, ఓవరాల్‌గా రూ. 1200 కోట్ల పై చిలుకే గ్రాస్ కలెక్ట్ చేస్తుంది (వరల్డ్‌వైడ్ అన్ని భాషల్లో కలిపి) అని అంచనా. ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ఈ ఫిగర్స్ ని రీచ్ అయ్యిపోవచ్చు.
డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’ . ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
సలార్ సినిమాకు ఫ్రెండ్‍షిప్ ముఖ్యమైన ఎమోషన్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెబుతాం. సలార్ మొత్తం కథను రెండు సినిమాలుగా చూపిస్తాం. మేం సృష్టించిన ప్రపంచాన్ని ట్రైలర్లో ప్రేక్షకులు చూపించాము” అని ప్రశాంత్ నీల్ చెప్పారు.
బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్. ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు.
సలార్‌గా ప్రభాస్, విలన్ వరదరాజ్ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
