సలార్ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేశారు ప్రభాస్ టీమ్. ఇక క్లైమాక్ కోసం భారీ ప్లానింగ్ తో ముందుకు రాబోతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో.. భారీ బడ్జెట్ తో.. సముద్రం అడుగున క్లైమాక్స్ ను తీయ్యబోతున్నట్టు తెలుస్తోంది.
యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా సలార్. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ చాలా కష్టపడుతున్నాడు. అటు ప్రభాస్ కూడా ఏ సినిమాకు పెట్టనంత ఎఫెక్ట్ సలార్ కోసం పెడుతున్నట్టు సమాచారం. కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ లతో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు టీమ్.
ఇక ప్రశాంత్ నీల్ నుంచి రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే సలార్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ క్లైమాక్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడట ప్రశాంత్ నీల్. దాని కోసం భారీ బడ్జెట్ కూడా సెట్ చేసుకున్నట్టు సమాచారం.
కేజీఎఫ్ 2 సినిమాలో క్లైమాక్స్ కి కథ సముద్రం పైకి చేరుకుంటుంది. అలాగే సలార్ సినిమా క్లైమాక్స్ కూడా సముద్రంపైకి చేరుకుంటుందని అంటున్నారు. సముద్రం లోపల ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.
సలార్ క్లైమాక్స్ కోసమే దాదాపు 10 కోట్లవరకూ బడ్జెట్ కేటాయించారట. అంది ఎక్కువ తక్కవ అయ్యే అవకాశం ఉన్నట్టు సామాచరం. ఇక ఇందులో నిజమెంతో తెలియదు కాని.. ఈ క్లైమాక్స్ కు మాత్రం ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయం అంటున్నారు మూవీ టీమ్. ఈ షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నట్టు తెలుస్తోంది.
లేటెస్ట్ షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ తో సమీక్ష జరిపి సెట్స్ కూడా రూపొందించాట. ప్రభాస్ కట్ అవుట్ కి సరిపోయేలా భారీ ఎత్తున యాక్షన్ సీన్స్ ను షూటింగ్ చేయనున్నారట. సినిమా మొత్తంలో ఫైట్స్ ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. సలార్ లో ప్రభాస్ చేసే పోరాటాలు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ కలిగించేలా ఉంటాయని వినికిడి. ఈ సన్నివేశాలు సలార్ చిత్రంలో హైలెట్ అంటున్నారు. ఇక హీరోయిజం ఎలివేషన్ ఎలా ఉండాలో కెజిఎఫ్ తో ప్రశాంత్ నీల్ చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు.
ఇక ఈసినిమాలో ప్రభాస్ సరసన హరోయిన్ గా శ్రుతి హాసన్ అలరించనుంది. ముఖ్యమైన పాత్రలలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కనిపించనున్నారు. జగపతిబాబు పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వచ్చే ఏడాదిలో సమ్మర్ లో సలార్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.