Asianet News TeluguAsianet News Telugu

#Salaar కు KGF కు లింక్ ఉందా?, క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

 ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. 

Prabhas #Salaar Cease Fire - Part 1 is not part of KGF universe jsp
Author
First Published Nov 29, 2023, 7:46 AM IST

కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరి దృష్టీ ఇప్పుడు ఆయన తాజా చిత్రం సలార్‌ (Salaar)పైనే ఉంది. కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం  యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రెండు పార్టులుగా వస్తోంది. Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్‌ ఈవెంట్‌ను రెడీ చేసుకుంటుంది ప్రభాస్‌ టీమ్. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 1 న రిలీజ్ చేయబోతున్నారు.  ఈ నేఫధ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ...ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు.

ముఖ్యంగా సలార్‌తో కేజీఎఫ్‍కు లింక్ ఉందా అన్న ప్రశ్నకు కూడా ప్రశాంత్ నీల్ స్పందించారు. కేజీఎఫ్, సలార్.. రెండు డిఫరెంట్ స్టోరీలు అని ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. సలార్‌కు కేజీఎఫ్‍తో లింక్ ఉండదన్నట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే, కేజీఎఫ్‍తో సలార్‌ను పోల్చకూడదని, డిఫరెంట్ ఎమోషన్స్, విభిన్నమైన స్టోరీ టెల్లింగ్ ఉంటుందని అన్నారు. తాను కేజీఎఫ్ కంటే ముందే సలార్ స్టోరీ రాసుకున్నానని ప్రశాంత్ నీల్ అన్నారు. అంటే ఈ సినిమాలో యష్ కనపడే అవకాసం లేదన్నమాట. 

  బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్. దాంతో డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ కుమ్మేస్తున్నారు. 
 
 ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో  ప్రభాస్ పెద్ద డిజాస్టర్  అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా  ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అద్బుతమైన అవుట్ ఫుట్ తో కేజీఎఫ్ ని మించిన హిట్ ఇవ్వాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు.  ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో సూపర్ బిజీగా ఉంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 విడుదల కానుంది.  ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

సలార్‌గా ప్రభాస్, విలన్ వరదరాజ్ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios