Asianet News TeluguAsianet News Telugu

Prabhas:ప్చ్... ప్రభాస్ త్యాగం వృధా అయ్యిందే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇండస్ట్రీలో అజాత శత్రువు. అందరితో స్నేహభావంతో ఉంటారు. అందులోనూ ప్రభాస్  చాలా సిగ్గరి. మొహమాటం ఎక్కువ అని చెప్తారు. ఎవరైనా ఏదైనా అడిగితే సహాయం చేయడానికి ముందుకు వస్తాడని అంటూంటారు. ఈ క్రమంలో  బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కోసం ఓ త్యాగం చేశాడు. తన సినిమా విడుదల తేదీని వదిలేశాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవటంతో ప్రభాస్ త్యాగం వృధా అయ్యినట్లే అంటున్నారు. వివరాల్లోకి వెళితే...

Prabhas Sacrifice for Laal Singh Chaddha wasted
Author
Mumbai, First Published Aug 14, 2022, 10:06 AM IST

శ్రీరాముని పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సినిమా 'ఆదిపురుష్'. సీతగా కృతి సనన్ కనిపించనున్నారు. 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ప్రజెంట్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ తేదీకి రాలేదు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కోసం వదిలేశారు.
 
మరో ప్రక్క ఏప్రిల్ 14న 'లాల్ సింగ్ చద్దా'ను విడుదల చేయాలనుకున్నారు. కానీ, సినిమా పనులు అనుకున్నట్టు సాగ లేదు. ఆ తేదీకి పూర్తి కాలేదు. అందుకని, విడుదలను వాయిదా వేశారు.అంతేకాకుండా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ ఆ తేదీకి తాము వస్తున్నట్టు 'ఆదిపురుష్' చిత్ర టీమ్ ఎప్పుడో ప్రకటించింది. అందుకని, ఆ సినిమా నిర్మాతలు దగ్గరకు వెళ్లి ఆమిర్ ఖాన్ అండ్ టీమ్ రిక్వెస్ట్ చేశారు. ఆమీర్  లాంటి స్టార్ అడగడంతో కాదనలేక తమ సినిమాను వాయిదా వేయడానికి 'ఆదిపురుష్' టీమ్ ఓకే చెప్పింది. 

వాళ్లకు ఆమిర్ టీమ్ థాంక్స్ చెప్పింది. అప్పుడు 'ఆదిపురుష్' కొత్త విడుదల తేదీ చూసుకున్నారు. అయితే ఇప్పుడు  'లాల్ సింగ్ చద్దా' డిజాస్టర్ అయ్యింది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ...అయ్యో ఆదిపురుష్ వస్తే హిందీలో కూడా పెద్ద హిట్ అయ్యేది. ఇక్కడా వర్కవుట్ అయ్యేది అని నిట్టూరుస్తున్నారు. ఆ సినిమా రిలీజ్  కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

'ఆదిపురుష్' సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తీస్తున్నారట. ఇందులో సీత పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 12, 2023న ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' త్రీడీలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios