రెబల్ స్టార్ ప్రభాస్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ ప్రమోషన్స్ డోస్ కూడా పెంచుతున్నాడు. రియాల్టీ షోలకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లి మరి సినిమాకి క్రేజ్ తెప్పిస్తున్నాడు. ఇకపోతే సాహో సినిమాకు ఒక అరుదైన రికార్డును అందుకుంది. 

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో సాహో ఎమోజిని క్రియేట్ చేశారు.సాధారణంగా ఎంతో అరుదుగా ట్విట్టర్ కొన్ని సినిమాలకు మాత్రమే ఎమోజిని ప్రవేశపడుతుంది. ఇక సాహో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతుండడంతో సినిమాకోసం ప్రత్యేకంగా ఎమోజిని రిలీజ్ చేశారు. బాలీవుడ్ - కోలీవుడ్ సినిమాల తరువాత ట్విట్టర్ ఎమోజిని అందుకున్న మొదటి సినిమా సాహో కావడం విశేషం. 

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహోను యూవీ క్రియేషన్స్ 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు తమిళ్ - హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది.