యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ పోతోంది. కనీవినీ ఎరుగని విధంగా దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తోంది. 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎక్కువ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే ఖర్చు చేస్తున్నారు. 

ఆగష్టు 15న సాహో చిత్రం విడుదల కాబోతోంది. దీనితో చిత్ర యూనిట్ నెమ్మదిగా ప్రచార కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇటీవల ప్రభాస్ స్పై లుక్ లో ఉన్న పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్ర కథ గురించి అనేక వార్తలు వస్తున్నా దేని గురించి స్పష్టమైన సమాచారం లేదు. ఈ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. 

ప్రభాస్ ఈ పోస్టర్ ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో విడుదల చేయగానే 24 గంటల్లోనే దాదాపు 8 లక్షల లైక్స్ సాధించింది. ఒక తెలుగు సినిమా పోస్టర్ ఇంస్టాగ్రామ్ లో ఇన్ని లైక్స్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. కొన్ని రోజుల క్రితమే ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాని ఓపెన్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ని ఇంస్టాగ్రామ్లో 1.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.