ఇప్పుడు ఎక్కడ చూసినా  ‘సాహో’గురించిన కబుర్లే.  ఈ సినిమా తెలుగుతోపాటు వివిధ భాషల్లో ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్‌ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు.  ఈ నేపధ్యంలో సాహో గురించి ప్రతీ మీడియా సంస్దా, వెబ్ మీడియా  రోజుకు నాలుగైదు కథనాలు వండి వార్చేస్తోంది. నిజానిజాలు ప్రక్కన పెట్టి సాహో ని తమ కథనాల్లో ప్రస్తావించటం ద్వారా ప్రాచుర్యం పొందాలని ప్రయత్నిస్తున్నాయి.

అందులో తప్పేమి లేదు కూడా. సాహో కు కూడా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది. వాళ్లకీ జనం రీచబులిటీ పెరుగుతుంది. అయితే అందుకోసం మరీ పులిహార కథనాలు వండేసినప్పుడే ఫ్యాన్స్ కు విసుగేస్తుంది. తాజాగా ఈ చిత్రం రెండు చిత్రాల కథలు కలిపి వండేసారంటూ వార్త మొదలైంది. 

బ్యాంక్ రాబరీ నేపథ్యంలోనే  ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్స్ ని బట్టి అర్దమైంది. దాంతో ... గతంలో వచ్చిన శంకర్, అర్జున్‌ల ‘జెంటిల్మెన్’, రవితేజ ‘కిక్’ ని బేస్ చేసుకుని ‘సాహో’ కథ తయారు చేసారంటూ కథనాలు మొదలయ్యాయి. హీరో దొంగలా ఎందుకు మారాడు. అందుకు దారితీసిన పరిస్థితుల నేపథ్యంలోనే ‘సాహో’ సినిమాను తెరకెక్కించినట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడే ఓ విషయం మర్చిపోతున్నారు. బాహుబలి వంటి పెద్ద హిట్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమా మరీ అంత నాశిరకంగా ఎందుకుంటుంది.. అందరికీ తెలిసిన కథలు కాపీ కొడాతారనే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాళ్లకైనా అనిపిస్తుంది. 

 బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్,మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్,చుంకీ పాండే, అరుణ్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఈ నెల 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు.