ప్రభాస్‌ నటిస్తోన్న 'సాహో' చిత్రం ఫస్ట్ సాంగ్ ని  ఈనెల 8న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. 'సైకొ సైయాన్‌..' అనే పల్లవితో ప్రారంభమయ్యే ఈ పూర్తి లిరికల్‌ విడియోను రిలీజ్‌ చేస్తామని   తెలియజేసింది. ఈ సాంగ్ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినీ లవర్స్ ను,అభిమానులను  పూర్తిగా నిరాశపరిచింది.   శ్రద్దాకపూర్ ని హైలెట్ చేస్తూ ప్రభాస్ ని పెద్దగా చూపలేదు. సర్లే పూర్తి సాంగ్ కాదు కదా అని సరిపెట్టుకున్నా... ఆ పాట హిందీలో షూట్ చేసి, తెలుగులోకి డబ్ చేసారని తెలిసిపోతోంది. దాన్ని బట్టి నిర్మాతలు పూర్తిగా బాలీవుడ్ నే టార్గెట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. 

బాహుబలి చిత్రాన్ని మొదట తెలుగు ప్రేక్షకులకు తగినట్లుగా రెడీ చేసి ఆ తర్వాత హిందీలోకి , ఇతర భాషల్లోకి డబ్ చేసారు. ఇప్పడది రివర్స్ లో జరుగుతున్నట్లు అనిపిస్తోంది.   ఈ సినిమాని యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేకంగా నిలవనుందని పేర్కొంటున్నారు.

ప్రతి సీన్‌నీ ఎలివేట్‌ చేసే విధంగా ప్రపంచ స్థాయి నాణ్యతతో రీ-రికార్డింగ్‌ అందించనున్నారు జిబ్రాన్‌ అని చెబుతున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌, జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్‌ విజరు, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్రకాష్‌ బెల్వాది, ఎవిలిన్‌ శర్మ, చంకీ పాండే, మందిరా బేడీ, మహేష్‌ మంజ్రేఖర్‌, టిను ఆనంద్‌, శరత్‌ లోహితష్వా తదితరులు నటిస్తున్నారు.