యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో చిత్రానికి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వస్తోంది. 300 కోట్ల బడ్జెట్ లో యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. యువి క్రియేషన్స్ ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాంటిదే. 

యువ దర్శకుడు సుజీత్ ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో తొలి రోజు షో చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అన్ని ఏరియాలలో సాహో తొలిరోజు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా సమాచారం మేరకు నైజాం ఏరియాలో సాహో చిత్రం తొలి రోజు నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

నైజాం ఏరియాలో బాహుబలి 2 చిత్రం తొలి రోజు 8.9 కోట్ల షేర్ రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో మహేష్ బాబు మహర్షి చిత్రం 6.4 కోట్లతో ఉంది. తాజాగా సాహో తొలిరోజు నైజాం వసూళ్లు 8 కోట్ల వరకు ఉండబోతున్నట్లు సమాచారం. అన్ని ఏరియాలలో సాహో వసూళ్లు వివరాలు తెలియాల్సి ఉంది.