Asianet News TeluguAsianet News Telugu

`కల్కి2898ఏడీ`లో ప్రభాస్‌ పాత్ర ఇదే.. అఫీషియల్‌గా ప్రకటించిన టీమ్‌..

ప్రభాస్‌ నుంచి వస్తోన్న మరో ప్రతిష్టాత్మక మూవీ `కల్కి 2898 ఏడీ`. ఈ చిత్రం మరోరెండు నెలల్లో రాబోతుంది. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా  సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రభాస్‌ పాత్ర ఏంటో తెలిపారు. 

prabhas role name revealed from kalki 2898ad  movie arj
Author
First Published Mar 8, 2024, 5:32 PM IST

ప్రభాస్‌ ప్రస్తుతం `కల్కి 2898 ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. పురణాలు, సైన్స్ ని మేళవించి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న చిత్రమిది. ఓ సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కుతుంది. భారీ స్థాయిలో సినిమాని తీర్చదిద్దుతున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా కల్కి తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్‌ పాత్రపై అనేక సస్పెన్స్ నెలకొంది. విష్ణువు చివరి అవతారమైన కల్కి పాత్ర ప్రధానంగా సినిమా సాగుతుందని, ప్రభాస్‌ కల్కి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో `కల్కి 2898 ఏడీ` నుంచి కొత్త లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. 

`కల్కి`లో ప్రభాస్‌ నటించే పాత్రని రివీల్‌ చేశారు. ఆయన భైరవ పాత్రలో కనిపించబోతున్నారట. ఈ మేరకు భైరవ పాత్రని పరిచయం చేస్తూ ఆయన లుక్‌ని విడుదల చేశారు. భవిష్యత్‌ వీధుల నుంచి కల్కి అంటూ ప్రభాస్‌ పాత్రకి సంబంధించిన హింట్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో డార్లింగ్‌ టెక్నాలజీతో తయారు చేసిన కవచం, జుట్టు ముడేసి, కళ్లకి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి కళ్లద్దాలు ధరించాడు. చేయి కండరానికి నల్లని పూత ఉంది. లుక్‌ సరికొత్తగా కనిపిస్తుంది. అతనే భైరవ అంటూ టీమ్‌ తెలియజేయడం విశేషం. 

మహాశివరాత్రి పర్వధినం పురస్కరించుకుని భైరవ పాత్రని పరిచయం చేశారు టీమ్‌. నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ఈ చిత్రంతో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు చాలా మంది గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. వారిలో విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, వంటి వారు ఉన్నారట. వైజయంతి మూవీస్‌ దీన్ని నిర్మిస్తుంది. ఈ మూవీని మే 9న విడుదల చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో దీన్ని రిలీజ్‌ చేయబోతున్నారు. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్‌, దిశా పటానీలపై ఓ సాంగ్‌ని చిత్రీకరించబోతున్నారట. అందుకోసం ఇటీవలే టీమ్‌ ఇటలీకి వెళ్లింది. ఈ సైన్స్ ఫిక్షన్‌ మూవీలో వీరిద్దరిపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఉంటుంది. దాన్నే ఇప్పుడు షూట్‌ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే మైథలాజికల్‌ అంశాలతో, పురణాలతో అంశాలతో సాగే ఈ మూవీలో రొమాంటిక్‌ సాంగ్‌ ఏంటి అనే సందేహం కలుగుతుంది. కానీ నాగ్‌ అశ్విన్‌ ఏదో మ్యాజిక్‌ చేసే ఉంటాడు. అదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక `కల్కి2898ఏడీ` మూవీ భవిష్యత్‌ 2898లో జరుగుతుంది. అక్కడి నుంచి ఆరువేల వెనక్కి వెళ్తుంది. దానికి దీనికి లింకేంటి? అనేదే మెయిన్‌ స్టోరీగా ఉంటుందట. 

read more: కన్నప్ప, గీతాంజలి, సత్యాభామ తో పాటు మహాశివరాత్రి స్పెషల్ ఫస్ట్ లుక్స్..

Also read: NBK109 Glimpse: వేట స్టార్ట్ చేసిన బాలయ్య.. దుమ్మురేపేలా `ఎన్బీకే109` గ్లింప్స్..

 

Follow Us:
Download App:
  • android
  • ios