నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. బాలయ్య వేట వేరే లెవల్‌లో ఉంది.
బాలకృష్ణ వరుస విజయాలతో ఉన్నారు. ఆయన బ్యాక్ టూ బ్యాక్ మూడు హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కంటెంట్‌తో వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. తాజాగా మహాశివ రాత్రి పండుగ సందర్భంగా ఈ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. బాలయ్య ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ విడుదల చేయగా, అది దుమ్మురేపేలా ఉంది. అడవిలో విలన్లని బాలయ్య వెంటాడి, వేటాడి చంపుతున్నాడు. ఓ రకంగా ఆయన ఊచకోత చూపిస్తున్నారు.
మొదట ఓ డ్యామ్ నుంచి నిప్పుల కొలిమి వస్తూ ఎన్బీకే పేరుని తడిపేసింది. ఆ తర్వాత అడవిలో మంటలు చెలరేగుతుంటాయి. విలన్లు బాలయ్యని వేసేయడానికి వస్తున్నారు. అప్పుడే జీపులో నుంచి దిగిన తన ఆయుధాల పెట్టె ఓపెన్ చేశాడు బాలయ్య. అందులో లిక్కర్ వేసుకుని యుద్ధానికి రెడీ అయ్యాడు. దీంతో వెనకాల వాయిస్ ఓవర్‌లో `ఏంట్రా వార్ డిక్లేర్ చేశావా? అని అడగ్గా, సింహం నక్కలమీదకు వస్తే వార్ కాదురా లఫూట్. హంటింగ్ అవుతుందని చెబుతూ, ప్రత్యర్థులకు ఉచకోత కొస్తూ తన విశ్వరూపం చూపించారు బాలయ్య.
గ్లింప్స్ చాలా స్టయిలీష్‌గా ఉంది. బీజీఎం అదిరిపోయింది. బాలయ్య సినిమాకి సరికొత్తగా ఉంది. తమన్‌లో కొత్త యాంగిల్ కనిపించింది. బాలయ్య మార్క్ కంటెంట్‌తోనే ఈ మూవీ రూపొందుతుందని అర్థమవుతుంది. కానీ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా కనిపిస్తుంది. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫోర్చ్యూ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య పేరుకి కొత్త అర్థం చెప్పారు దర్శకుడు. నేచురల్ బార్న్ కింగ్(ఎన్బీకే) అనే చెప్పడం విశేషం. అయితే టైటిల్‌ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
