Asianet News TeluguAsianet News Telugu

రజిని ప్లేస్ ని భర్తీ చేసిన ప్రభాస్ ని చూసి కుళ్ళుకుంటున్న కోలీవుడ్..!

పాన్ ఇండియా ఇమేజ్ కలిగిన ప్రభాస్ చిత్రాలకు ఏ స్థాయిలో మార్కెట్ ఉందో ఆయన గత మూడు చిత్రాలు నిరూపించాయి. దీనితో పరిశ్రమ ఏదైనా వందల కోట్ల బడ్జెట్ మూవీ అంటే ముందుగా ప్రభాస్ గుర్తొస్తున్నారు. ఒకప్పటి రజిని ప్లేస్ ని ప్రభాస్ భర్తీ చేయగా కోలీవుడ్ లో కొంచెం అసహనం మొదలైంది. 

prabhas replaces rajini kanth kollywood not happy with that
Author
Hyderabad, First Published Sep 5, 2020, 1:55 PM IST

ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏమిటో అందరికీ తెలుసు. దేశంలోనే అత్యధిక మార్కెట్ కలిగిన హీరోగా ప్రభాస్ అవతరించాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అమీర్, అక్షయ్ మరియు హృతిక్ వంటి హీరోలు కూడా ఆ స్థాయి చిత్రాలలో నటించడం లేదు. బాహుబలి విజయం తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. దీనితో భారీ బడ్జెట్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా ప్రభాస్ మారిపోయాడు. బాహుబలి విజయం రాజమౌళి ఖాతాలో వేసిన బాలీవుడ్ ఆ తరువాత ప్రభాస్ చిత్రాలకు కనీస ఆదరణ వుందని భావించారు. 

సాహూ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలవడంతో ప్రభాస్ రియల్ స్టామినా అందరికీ అర్థం అయ్యింది. బ్యాడ్ టాక్ తో మొదలైన ఆ చిత్రం 150 కోట్ల వసూళ్లను అక్కడ కొల్లగొట్టి క్లీన్ హిట్ గా నిలిచింది. సాహో ఫలితం తరువాత బాలీవుడ్ దర్శకులకు సైతం ప్రభాస్ మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. ప్రభాస్ కి మించిన స్టార్ డమ్ అక్కడ హీరోలకు ఉన్నా, వారికి సౌత్ లో మార్కెట్ లేదు. కానీ సౌత్ అండ్ నార్త్ లో ఇమేజ్ కలిగిన హీరో ప్రభాస్ అని చెప్పాలి. ఇక జపాన్, రష్యా వంటి దేశాలలో కూడా ప్రభాస్ సినిమాలు విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. 

సౌత్ నుండి ఒకప్పుడు ఇంతటి స్టార్ డమ్ ఒక్క రజినీ కాంత్ కి మాత్రమే ఉండేది. రజినీ కూడా సౌత్ ఇండియాతో పాటు నార్త్ లో కూడా మార్కెట్ కలిగిన హీరోగా ఉన్నారు. అందుకే ఆయన రోబో, కబాలి, రోబో 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించడం జరిగింది. ఇప్పటికే మూడు భారీ బడ్జెట్ చిత్రాలలో నటించిన ప్రభాస్ నుండి రానున్న రాధే శ్యామ్, ప్రభాస్ 21, ఆదిపురుష్ చిత్రాలు కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్ దాదాపు 1000 కోట్లకు పైమాటే. 

మరి సౌత్ ఇండియాలో ఆదిపత్యం అంతా మాదే అని భావించే కోలీవుడ్ కి ప్రభాస్ ఎదుగుదల కొంచెం మింగుడు పడని అంశం. భాషా, ప్రాంతీయాభిమానం నరనరాన నింపుకున్న తమిళ తంబీలు దీనిని ఒప్పుకోలేకపోతున్నారు. తమ హీరో రజనీని కూడా ప్రభాస్ మించి పోవడం వారికి కొంచెం నచ్చడం లేదు. రజినీ స్థానం కోలీవుడ్ నుండి విజయ్, అజిత్ లాంటి స్టార్స్ భర్తీ చేస్తారని వారు భావించారు. కానీ ప్రభాస్ ప్రస్తుత మార్కెట్ తో పోల్చుకుంటే వారు చాలా వెనుక ఉన్నట్లే. సౌత్ పై ఆధిపత్యం టాలీవుడ్ ది అవుతుండగా వారిలో అసహనం పెరిగిపోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios