ప్రభాస్ కే అంత ఇస్తే..ఇంక బడ్జెట్ ఎంత?

 ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు దేశంలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతుండ‌డం, ప్ర‌భాస్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండ‌డంతో ప్ర‌భాస్‌కు ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యార‌ని వినికిడి. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే ప్రభాస్ నే అడగాలి లేదా ఆ చిత్ర నిర్మాత రివీల్ చేయాలి. ఈ రెండూ జరిగేవి కాదు. 

Prabhas  remuneration for Adipurush revealed  jsp

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో  “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది.  ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అంగద్ బేడీ ఇంద్రజిత్ గా,  లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్‌ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారు. ఇవన్నీ వింటూంటే సినిమా ఏ స్దాయిలో భారితనంతో మనకు కనపడబోతోందో అర్దమవుతోంది. అదే సమయంలో ప్రభాస్ కు ఈ సినిమా నిమిత్తం ఎంత ఇవ్వబోతున్నారు అనేది సైతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...ఆదిపురుష్‌ కోసం టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు దేశంలోని అన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతుండ‌డం, ప్ర‌భాస్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండ‌డంతో ప్ర‌భాస్‌కు ఈ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యార‌ని వినికిడి. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే ప్రభాస్ నే అడగాలి లేదా ఆ చిత్ర నిర్మాత రివీల్ చేయాలి. ఈ రెండూ జరిగేవి కాదు. 

ఆదిపురుష్‌ త్రిడిని అత్యంత భారీ బడ్జెట్‌తో టీ సిరీస్‌ నిర్మించనుంది. సుమారు 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్ట్‌ 11న ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు.పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించనుంది. ఇక లంకేశ్వరుడు రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ అలరించనున్నాడు. దాదాపుగా నటులంతా బాలీవుడ్ కి చెందిన వారే ..కేవలం ప్రభాస్ తప్ప అంటున్నారు. సౌత్ నుంచి ఆర్టిస్ట్ లు పెద్దగా లేకపోతే మనకు ఇక్కడ ఐడింటిటీ అవ్వటం కష్టం. అయితే పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇలాంటి ఎడ్జస్ట్ మెంట్స్ తప్పవు.  

 దర్శకుడు ఓం​ రౌత్‌ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ భారతీయ ఇతిహాసం రామాయణం అనుకరణ. ఈ సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ఓ కార్యక్రమంలో ప్రభాస్‌ను చూశాను. ఆదిపురుష్‌కు అతను అయితే కరెక్ట్‌గా సరిపోతాడని నాకు గట్టిగా అనిపించింది. ఎందుకంటే అతడి ఆకర్షణీయమైన కళ్లు, వైఖరి, అతని వ్యక్తిత్వం. చెప్పాలంటే ప్రభాస్‌లో ఆదిపురుష్‌ను చూడగలిగాను. ప్రభాస్‌తో తప్ప ఇంకేవరితో ఈ సినిమా చేయలేను’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. భారీ బడ్జేట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios