`రొమాంటిక్‌` ట్రైలర్ విడుదల సందర్భంగా ప్రభాస్‌ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. అంతేకాదు `రొమాంటిక్‌` సినిమా ట్రైలర్‌ కూడా అంతే రొమాంటిక్‌గా ఉందని, ఆకాష్‌ పూరి, హీరోయిన్‌ కేతిక శర్మ కూడా అద్భుతంగా చేశారని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందన్నారు.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. పూరీ జగన్నాథ్‌ తనయుడు, కుర్ర హీరో ఆకాష్‌ పూరీపై ప్రశంసలు కురిపించారు. పదేళ్ల అనుభవం ఉన్న హీరోలా చేశాడని, ఓ స్టార్‌ ఇమేజ్‌ వచ్చిన హీరోలా యాక్ట్ చేశాడని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆకాష్‌పూరీ, కేతిక శర్మ జంటగా నటించిన `రొమాంటిక్‌` చిత్రానికి అనిల్‌ పడూరి దర్శకత్వం వహించారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ మంగళవారం ప్రభాస్‌ విడుదల చేశారు. 

 Romantic ట్రైలర్ విడుదల సందర్భంగా Prabhas చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. అంతేకాదు `రొమాంటిక్‌` సినిమా ట్రైలర్‌ కూడా అంతే రొమాంటిక్‌గా ఉందని, Aakash Puri, హీరోయిన్‌ Kethika Sharma కూడా అద్భుతంగా చేశారని, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందన్నారు. కేతిక చాలా బాగుందని, ఆమెకి ఈ సినిమాతో మంచి ఆఫర్స్ వస్తాయన్నారు. రొమాన్స్‌, యాక్షన్‌ మేళవించిన చిత్రం పెద్ద హిట్‌ అవ్వాలని, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు ప్రభాస్‌.ఇదిలా ఉంటే ప్రభాస్‌ `ఆదిపురుష్‌` లుక్‌లో ఉన్నారు. ఆయన గుబూరు మీసాలతో ఆకట్టుకుంటున్నారు. కొత్త లుక్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. 

మరోవైపు Romantic Trailerఈవెంట్‌ని హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ఈ సాయంత్రం నిర్వహించారు. ఇందులో పూరీ జగన్నాథ్‌, ఛార్మి, ఆకాష్‌ పూరీ, కేతిక శర్మతోపాటు ఇతర చిత్ర యూనిట్‌ పాల్గొంది. వారు సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇక `రొమాంటిక్‌` ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వచ్ఛమైన ప్రేమలోని ఘాటుని పరిచయం చేసేలా ఉంది. పూరీ జగన్నాథ్‌ స్టయిల్‌లో అంతే బోల్డ్ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా రమ్యకృష్ణ మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. సునీల్ కశ్యప్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు.

also read: `జబర్దస్త్` రష్మి నడుము సొగసు చూడతరమా.. మెడలో ముత్యాల హారం స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ పిక్స్