స్టార్ డైరెక్టర్ కు నో చెప్పేశాడు!

prabhas rejects karan johar's bollywood offer again
Highlights

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో చెప్పనక్కర్లేదు. స్టార్ డైరెక్టర్లు 

'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో చెప్పనక్కర్లేదు. స్టార్ డైరెక్టర్లు అతడితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం తను ముందుగా కమిట్మెంట్ ఇచ్చిన దర్శకుల సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతంఅబుదాబిలో జరుగుతోంది.

మూడు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేయనున్నాడు. అయితే బాహుబలి సినిమా తరువాత బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ తనతో హిందీ సినిమా చేయమని ప్రభాస్ కు చాలా కోట్లు రెమ్యునరేషన్ గా ఆఫర్ చేశాడు. కానీ ప్రభాస్ దానికి అంగీకరించకుండా ఇచ్చిన మాట ప్రకారం తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలు పూర్తయిన తరువాత అయినా తన సినిమాకు డేట్స్ ఇవ్వమని కరణ్.. ప్రభాస్ ను కోరాడట. దీనికి సమాధానంగా ప్రభాస్.. ''ఈ చిత్రాలపై దర్శకులు చాలా ఆశలు పెట్టుకున్నాడు. సీన్స్ ఏమైనా సరిగ్గా రాకపోతే మళ్ళీ రీషూట్ చేయాల్సివుంటుంది. అప్పుడు నేను వారికి అందుబాటులో ఉండాలి. అందుకే ముందుగా మీకు డేట్స్ ఇవ్వలేనని'' స్పష్టం చేశాడట ప్రభాస్. 
 

loader