రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ నెలలో పెద్ద పండుగ ఉంది. అక్టోబర్ 23న తమ అభిమాన హీరో పుట్టినరోజు జరుపుకోకున్నారు. దీనితో నెల రోజుల ముందు నుండే అభిమానాలు భారీ ఏర్పాట్లలో ఉన్నారు. సోషల్ మీడియాలో నయా రికార్డ్స్ సెట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కరోనా కారణంగా భౌతిక వేడుకలు పెద్దగా ఉండనప్పటికీ, సోషల్ మీడియా వేడుకలు మాత్రం ఘనంగా జరగనున్నాయి. మరో వైపు ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం ఏకంగా మూడు క్రేజీ అప్డేట్స్ సిద్ధం చేస్తున్నారు. 

ఆయన ప్రస్తుతం నటిస్తున్న రాధే శ్యామ్ మూవీతో పాటు ప్రభాస్ 21, ఆదిపురుష్ చిత్రాల నుండి కీలక అప్డేట్స్ రానున్నాయి. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ 50శాతం వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్ర షూటింగ్ త్వరలో యూరప్ లో తిరిగి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ మూవీ టీజర్ విడుదల కానుందని గట్టి సమాచారం. నిజంగా ప్రభాస్ బర్త్ డే నాడు టీజర్ వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. 

అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ 21 మూవీపై కూడా అప్డేట్ సిద్ధం చేశారు. ప్రభాస్ 21 షూటింగ్ మొదలుపెట్టనప్పటికీ ఓ చిన్న అప్డేట్ ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ రామాయణ గాథను ఆదిపురుష్ టైటిల్ తో తెరకెక్కించనున్నాడు. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్ నటించనుండగా విజువల్ వండర్ గా తెరకెక్కనుంది. 

ఆదిపురుష్ మూవీలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు ఇప్పటికే ఓ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దర్శకుడు ఓం రౌత్ కూడా ఆదిపురుష్ మూవీపై కీలక అప్డేట్ ఇవ్వనున్నాడట. ఆదిపురుష్ మూవీలో సీతగా నటించే హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ప్రభాస్ బర్త్ డే కానుకగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తంగా వరుస అప్డేట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ బర్త్ డే రోజు పండగ చేసుకోనున్నారు.