ఇద్దరూ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. కాకతాళీయంగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మగధీరతో ఇండస్ట్రీ హిట్ ఇస్తే... తాజాగా బాహుబలితో ప్రబాస్ ఇండియా హిట్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఏం జరిగినా అది ఓ రేంజిలో వుంటుంది. తాజాగా వీళ్ల కాంబినేషన్ లో సినిమాలు రాబోతున్నాయి. అదేనండీ ఇద్దరు కలిసి థియేటర్స్ నిర్మాణం, సినిమాల ప్రదర్శన కోసం భాగస్వాములుగా మారి సినిమాలతో బిజినెస్ చేస్తున్నారట.

 

ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీల్లో బన్నీ, తమన్నా, సురేందర్ రెడ్డి ఇలా చాలా మంది సొంత వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి కొత్త బిజినెస్ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది.

 

గత కొంత కాలంగా ప్రభాస్, రామ్ చరణ్‌లు కలిసి వ్యాపారం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రభాస్‌కు ఎప్పటినుండో ఓ మల్టీప్లెక్స్ నిర్మించాలనే కోరిక. ఈ మేరకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఓ స్థలం కూడా కొని ఉంచారు. అయితే రామ్ చరణ్‌తో కలిసి ఈ వ్యాపారం చేయాలనేది ప్రభాస్ ప్లాన్. ఇద్దరూ కలిసి ఓ జాయింట్ వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్‌ను లీజ్‌కు తీసుకొని వ్యాపారం చేస్తున్నారట. ఇదంతా కూడా యువి క్రియేషన్స్, కొణిదల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో జరుగుతుందని . తెలుస్తోంది చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' సినిమా నైజాం హక్కులను యువి క్రియేషన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి పెద్ద ప్లానే వేశారు.