ప్రభాస్‌ హీరోగా, పూజా హెగ్డే కథానాయికగా రూపొందుతున్న చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదలైంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ప్రభాస్‌ రెట్రోలుక్‌ని విడుదల చేశారు. ఈ నెల 23న ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ లుక్ ని విడుదల చేయగా, దీనికి విశేష స్పందన లభిస్తుంది. 

ఇప్పటికే ప్రభాస్‌ బర్త్ డే సీడీపీ విడుదల చేయగా, అది సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. తాజా `రాధేశ్యామ్‌`లోని ఆయన సోలో లుక్‌ సైతం ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ప్రభాస్‌ `విక్రమ్‌ ఆదిత్యగా కనిపించబోతున్నారు. ఇప్పటికే హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్రని విడుదల చేయగా, అందులో పూజా ప్రేరణ అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్టు తెలిపారు. 

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.