Asianet News TeluguAsianet News Telugu

Radhe Shyam:ట్రైలర్ లో కనిపించే ఎలిమెంట్స్ ఇవే

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు.   

prabhas Radhe Shyam Strategy For Trailer
Author
Hyderabad, First Published Dec 4, 2021, 7:18 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


 యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ‘రాధేశ్యామ్‌’ రిలీజ్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్ ని మూడు వెర్షన్స్ దాకా రెడీ చేస్తున్నట్లు సమాచారం. ట్రైలర్ బయిటకు వస్తే సెన్సేషన్ అవ్వాలని టీమ్ ఎదురుచూస్తోంది. అదే సమయంలో ట్రైలర్ లో ఏ కంటెంట్ ఉండాలి అనే విషయమై ప్రత్యేకమైన స్ట్రాటజీని టీమ్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.  వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‌ పూర్తిస్థాయి లవర్‌బాయ్‌ పాత్ర పోషించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి(palmist) పాత్రలో కనిపించనున్నారు.  ఈ ట్రైలర్ లో కొన్ని ఎలిమెంట్స్ ని ఖచ్చితంగా ఉండాలని డైరక్టర్ భావిస్తున్నారట.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ట్రైలర్ లో సినిమా మెయిన్ ప్లాట్, కాంప్లిక్ట్ పాయింట్ చెప్పేయబోతున్నారట. దాంతో మెయిన్ స్టోరీ మొత్తం ట్రైలర్ లో కనిపిస్తుంది. దాన్ని ఎంత అందంగా ఎలా ఎగ్జిక్యూట్ చేసారనే విషయం చూడటానికి థియోటర్ కు రావాలనేది దర్శక,నిర్మాతల ఆలోచనగా చెప్తున్నారు. ఈ రకంగా ప్రేక్షకులను,ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేస్తే రేపు సినిమా రిలీజ్ అప్పుడు అందుకు తగిన ఎక్సపెక్టేషన్స్ తోనే వస్తారని, ఓ లవ్ స్టోరీగా ఈ సినిమా చూడాలని, అంతకు మించి ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లు యాక్షన్ ఇమేజ్ తో వస్తే ప్రమాదమని ఇలా ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, పోస్టర్ లలో ప్రభాస్‌ లుక్‌, డైలాగ్‌లు, హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. జస్టిన్‌ ప్రభాకరణ్‌ అందించిన సంగీతం హత్తుకునేలా ఉంది. ‘బాహుబలి’, ‘సాహో’ వంటి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. 

అలాగే  ‘‘నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు. కానీ, నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ, నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా అది మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడ్ని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు’’ అంటూ టీజర్‌లో ప్రభాస్‌ పలికిన డైలాగులు సినిమాపై ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. టీజరే ఈ విధంగా ఉంటే ట్రైలర్ ఎలా ఉండబోతోందో అనే ఆలోచన ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. 

Also read ప్రభాస్‌, సల్మాన్‌ ఖాన్‌లను వాడుకోబోతున్న అల్లు అర్జున్‌.. చిరంజీవి, వెంకటేష్‌లతో సల్లూభాయ్‌.. సరికొత్త గేమ్‌

గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. 70ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమకథతో రూపొందుతోంది.  ఇది కాలం, జాతకాలతో ముడిపడి ఉన్న ప్రేమ  కథని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read Nagumomu Thaarale Video Song:'నాతో ప్రేమలో పడితే చస్తావ్'.. మనసులు దోచేస్తున్న నగుమోము తారలే సాంగ్

Follow Us:
Download App:
  • android
  • ios