Asianet News TeluguAsianet News Telugu

తిరిగి ప్రారంభమైన రాధే శ్యామ్ షూట్!

కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో టాలీవుడ్ లో చిత్రాల షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. కాగా నేటి నుండి రాధే శ్యామ్ షూటింగ్ సైతం తిరిగి ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో రాధే శ్యామ్ షూటింగ్ జరుపుకుంటుంది.

prabhas radhe shyam shoot resumes in hyderabad today ksr
Author
Hyderabad, First Published Jun 25, 2021, 2:51 PM IST

రాధే శ్యామ్ షూటింగ్ మొదలై దాదాపు మూడేళ్లు కావస్తుంది. అనేక కారణాల చేత షూటింగ్ సవ్యంగా సాగలేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రాధే శ్యామ్ షూటింగ్ ని మరింత ఆలస్యం అయ్యేలా చేశాయి. ఇక ప్రభాస్ నుండి మూవీ వచ్చి రెండేళ్లు కావస్తుంది. 2019లో సాహో విడుదల కాగా, ఫ్యాన్స్ ఆయన నుండి మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. జులై నెల రాధే శ్యామ్ విడుదల తేదీగా ప్రకటించడం జరిగింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చెప్పిన సమయానికి మూవీ విడుదలయ్యే సూచనలు లేవు. 


కాగా కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో టాలీవుడ్ లో చిత్రాల షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం జరిగింది. కాగా నేటి నుండి రాధే శ్యామ్ షూటింగ్ సైతం తిరిగి ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో రాధే శ్యామ్ షూటింగ్ జరుపుకుంటుంది. తాజా షెడ్యూల్ ద్వారా రాధే శ్యామ్ షూటింగ్ ముగియనుందని సమాచారం. 


ఇక రాధే శ్యామ్ మూవీ కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సెట్స్ కోసమే విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కుతుంది. దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాధే శ్యామ్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఓ కీలక రోల్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios