ప్రేమికుల రోజు సంధర్భంగా రాధే శ్యామ్ చిత్రం నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఓ రైల్వే స్టేషన్ లో పూజా హెగ్డే ను ప్రభాస్ ఇటలీ భాషలో పిలుస్తూ ఉండగా.. అక్కడ ఉన్న అమ్మాయి ఆసక్తికరంగా స్పందించడం వీడియోలో ఆకట్టుకుంది. ప్రభాస్ లుక్, కాస్ట్యూమ్స్ చాలా రిచ్ గా అనిపించగా... వీడియోలోని రైల్వే స్టేషన్ లొకేషన్ చాలా బాగుంది. అయితే ఆ రైల్వే స్టేషన్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ అని రివీల్ చేశారు. అది సెట్ అని తెలుసుకున్న నెటిజెన్స్... షాక్ తినడమే కాకుండా.. మోసపోయాం మామా అంటూ కామెంట్ చేస్తున్నారు. 


అన్నపూర్ణ స్టూడియో అధికారిక ట్విట్టర్ లో ఈ సెట్ కి సంబందించిన ఫోటో పంచుకోవడంతో పాటు, రాధే శ్యామ్ మూవీ కోసం వేసిన రైల్వే స్టేషన్ సెట్ అని తెలియజేశారు. విదేశాల్లోని  70ల కాలం నాటి రైల్వే స్టేషన్ ని దించేశాడు ఆర్ట్ డైరెక్టర్. ఆయన పనితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక రాధే శ్యామ్ మూవీ జులై 30న గ్రాండ్ గా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల కానుంది. 


దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా రాధే శ్యామ్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ గోదావరి ఖనిలో సలార్ షూటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.