పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్నంత మంచి పేరు మరో హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఆయనతో పనిచేసిన డైరెక్టర్స్, హీరోయిన్స్ మరియు నిర్మాతలు ఆయన సో గుడ్ అంటారు. భోజన ప్రియుడైన ప్రభాస్ సెట్స్ లోకి ప్రత్యేక వంటకాలు చేయించి తీసుకు వస్తారు. అలా తెచ్చిన వంటకాలను కలిసి పనిచేసే నటులకు విందు భోజనంగా వడ్డిస్తారు. ఇక దానాలలో కూడా ప్రభాస్ కర్ణుడనే చెప్పాలి. పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభాస్ కష్టకాలంలో కోట్లలో దానం చేశారు. 

మిగతా స్టార్ హీరోల కంటే ప్రభాస్ ఎక్కువ మొత్తం దానం చేయడం జరిగింది. తన పర్సనల్ ట్రైనర్ కి ఏకంగా రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చి ఆశ్యర్యపరిచాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ చేసిన ఓ పని అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా రాధే శ్యామ్ టీమ్ మెంబర్స్ అందరికీ ప్రభాస్ రిస్ట్ వాచ్ లు బహుమతిగా ఇచ్చారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ కాగా ఆయన పంచిన వాచెస్  ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
ఎవరూ చేయని పనులు చేస్తూ ప్రభాస్ నిజంగా తాను డార్లింగ్ అని నిరూపించుకుంటున్నారు. 

ఇక నేడు సలార్ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కెజిఎఫ్ స్టార్ యష్ వచ్చారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరో వైపు ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.