Salaar Cease Fire : ‘సలార్’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రానుంది? సాలిడ్ అప్డేట్.!
Salaar Cease Fire పదిరోజుల్లో విడుదల కాబోతోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క సాంగ్ కూడా విడుదల కాలేదు. ఇంతకీ పాటల రిలీజ్ ఉంటుందా? లేదా? అనే సందేహంలో తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అందింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ రెండు భాగాలుగా రానుంది. మొదటి పార్ట్ ను Salaar Cease Fire గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రాన్ని సంబంధించిన టీజర్, ట్రైలర్ ను విడుదల చేసి ప్రపంచ ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. అన్నీ బాగుంటే సెప్టెంబర్ చివరల్లోనే రావాల్సిన ఈ చిత్రం బెస్ట్ అవుట్ పుట్ కోసమని డిసెంబర్ లాస్ట్ వీక్ కు ఫిష్ట్ అయిన విషయం తెలిసిందే.
అయితే మొన్ననే ‘సలార్ ట్రైలర్ ను విడుదల చేసింది టీమ్. దాంతో అభిమానులు సాటిస్ఫై కాలేదని మరో ట్రైలర్ నూ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాపై కేవలం యాక్షన్ తోనే హైప్ తెప్పించారు. ఇప్పటి వరకు ఒక్క సాంగ్ ను కూడా రిలీజ్ చేయలేదు. కనీనం అప్డేట్ కూడా లేదు. ‘కేజీఎఫ్’తో దుమ్ములేపిన రవి బర్రూర్ ఈ చిత్రానికి ఎలాంటి సంగీతం అందించారన్నది చాలా ఆసక్తికరంగా మారింది. కానీ మరో పది రోజుల్లో సినిమా రిలీజ్ ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో అసలు సాంగ్స్ ఉంటాయా? లేవా? అన్నది సందేహంగా మారింది.
ఈక్రమంలో సోషల్ మీడియాలో Salaar First Single పై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సాయంత్రమే సలార్ ఫస్ట్ సింగిల్ పై అనౌన్స్ మెంట్ రానుందని, రేపు ఉదయం ఫుల్ సాంగ్ రాబోతుందని అంటున్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దానికోసమే అంతా వెయిట్ చేస్తున్నారు. సలార్ మొదటి పాట ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక చిత్రం అడ్వాన్డ్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఇప్పటికే బుక్ మై షోలో బుకింగ్స్ మొదలయ్యాయి.
సలార్ రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలుగా తెలుస్తోంది. అంటే దాదాపు మూడు గంటల పాటు ప్రభాస్ హోరాహోరా యుద్ధంతో థియేటర్లు బద్దలు కానున్నాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. శృతి హాసన్ (Shruti Haasan) కథానాయిక. రవి బర్రూర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది.