ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌  కాంబినేషన్‌కి సంబంధించి మరో క్రేజీ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై దిల్‌రాజు మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఇప్పుడు `సలార్‌` చిత్రంతో రూపొందుతుంది. మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది సెప్టెంబర్‌ లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కాంబినేషన్‌కి సంబంధించి మరో క్రేజీ అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కలిసి పనిచేయబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతుందని అంటున్నారు. 

తాజాగా దీనిపై నిర్మాత దిల్‌రాజు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఈ కాంబోని కన్ఫమ్‌ చేశారు. వీరిద్దరితో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఇది పట్టాలెక్కుతుందని అన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత మరోసారి సినిమా ఉంటుందన్నారు. అంతేకాదు ఈ సినిమా ఎలాంటి జోనర్‌లో ఉంటుందో కూడా ఆయన వెల్లడించారు. 

`ప్రభాస్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ పౌరాణిక చిత్రం రానుంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ `సలార్‌`లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే ప్రభాస్‌ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక ప్రశాంత్‌నీల్‌తో ప్రభాస్‌ సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది` అని చెప్పారు దిల్‌రాజు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. క్లారిటీతో కూడిన కన్ఫమేషన్‌ ఇచ్చారీ బడా నిర్మాత. అయితే ఈ ఇద్దరి కాంబోలో మైథలాజికల్‌ మూవీ అనే సరికి ఇటు అభిమానుల్లో, అటు ట్రేడ్‌ వర్గాల్లో భారీ హైప్‌ ఏర్పడుతుంది. మరి ఇది ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి. 

దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న `సలార్‌`పై భారీ అంచనాలున్నాయి. ఏకంగా వెయ్యి కోట్ల సినిమా అవుతుందంటున్నారు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ షాకిస్తుంది.ఏకంగా 500 నుంచి 600కోట్ల బిజినెస్‌ జరుగుతుందని తెలుస్తుంది. డిజిటల్‌ రూపంలో మరో రెండు వందల కోట్లు వచ్చే అవకాశం ఉందట. అంతే ఈ చిత్రం విడుదలకు ముందే ఏడువందల కోట్ల వ్యాపారం చేస్తుందంటే అతిశయోక్తి కాదు. రిలీజ్‌ కి ముందే లాభాలు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్ అవుతుంది. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.