మలయాళ స్టార్ హీరో డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా..? అనౌన్స్ మెంట్ ఎప్ప్పుడంటే..?
ఇప్పటికే వరుసగాసినిమాలు లైన్ లో పెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రాభాస్.. ఒక్కొక్కటిగా సినిమలను కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. ఉన్న సినిమాలు కంప్లీట్ అవ్వకమేందే మరో సినిమాను కమిట్ అవుతూ.. షాక్ ఇస్తున్నాడు ప్రభాస్. తాజాగా యంగ్ రెబట్ స్టార్ మరో ప్రాజెక్ట్ ను సీక్రేట్ గా ఓకే చేశారట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. యూనివర్సల్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చూస్తున్నాడు వరుసగా మూడు ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. తాజాగా ఆదిపురుష్ వేసిన దెబ్బకు ప్రభాస్ బాగా అప్ సెట్ అయ్యాడు. అందుకే నెక్ట్స్ సినిమాల విషంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ప్రభాస్.
ప్రభాస్ ఇప్పటికే సలార్, కల్కి, సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజాడీలక్స్.. లాంటిసినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలతో బిజీగా ఉన్నా సరే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడు ప్రభాస్. సందీప్ రెడ్డి తో స్పిరిట్ ని స్టాండ్ బైలో ఉంచారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. వీటితో పాటు ప్రభాస్ మరో సీక్రేట్ సినిమాను కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. అదికూడా ఓ స్టార్ హీరో దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాకి రెడీ అవుతున్నట్టు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.
మలయాళ నటుడు, డైరెక్టర్ అయిన పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ లో పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. పృధ్విరాజ్ పొటెన్షియల్ డైరెక్టర్ గా పేరుంది. అంతకముందు చేసిన లూసిఫర్, బ్రో డాడీ లాంటి సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేశారు పృధ్విరాజ్. ఈ సనిమాలు సౌత్ మొత్తం మంచి హిట్ అవ్వడంతో పృధ్విరాజ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అయితే సలార్ సెట్ లో ప్రభాస్ కు అదరిపోయే కథ వివరించాడట సందీప్. దాని సందీప్ కూడా ఓకే యినట్టు తెలుస్తోంది. మరి వీరి కాంబో విషంలో నిజం ఎంత..? ఒక వేళ ఈసినిమా తెరకెక్కితే ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.