వెండితెరపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి సూపర్ హిట్ జోడి. వీరిద్దరూ బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి చిత్రాల్లో నటించారు. బాహుబలి తర్వాత ప్రభాస్, అనుష్క కేంద్రంగా రూమర్లు ఎలా వ్యాపించాయో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో ప్రభాస్ ఎదురవుతున్న ప్రశ్న.. మీరు అనుష్కతో రిలేషన్ షిప్ లో ఉన్నారా అని. 

ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ కు అనుష్క గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ప్రభాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'నేనైనా, అనుష్క అయినా ఎవరో ఒకరిని త్వరగా పెళ్లి చేసుకోకుంటే ఈ రూమర్లు ఆగేలా లేవు. అనుష్క నువ్వైనా ఎవరో ఒకరిని త్వరగా పెళ్లి చేసుకో అని చెబుతా. 

మేమిద్దరం రిలేషన్ లో ఉంటే ఏ ఇటలీలోనో, మరేదైనా బీచ్ లోనే హ్యాపీగా కలసి తిరిగేవాళ్ళం కదా అని ప్రభాస్ తెలిపాడు. ఇలాంటి విషయాలని ఎందుకు దాచిపెడతాం. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు ప్రచారం చేయడం సరైంది కాదు అని ప్రభాస్ తెలిపాడు. ఇటీవల ప్రభాస్, అనుష్క లాస్ ఏంజిల్స్ లో సొంతగా ఓ ఇల్లు కొంటున్నట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి.