ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో చేయటం వింతేమీ కాదు..కొత్త అసలు కాదు. అలాంటిదే ఇప్పుడు ప్రభాస్ కొత్త చిత్రానికి జరగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అప్పట్లో యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం ప్లాన్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా అనుకున్నారు. అయితే బడ్జెట్  లిమిటేషన్స్, యేలేటి సక్సెస్ లో లేకపోవటం వంటి కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడా కథనే ప్రభాస్ తో చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

 యేలేటి శిష్యుడు 'జిల్‌' తీసిన రాధాకృష్ణ...ఆ కథను తాను చేసుకుంటానని తీసుకుని,ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు మార్పులు ,చేర్పులు చేసినట్లు చెప్తున్నారు.  ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తోంది.  ఈ సినిమా జోనర్‌ ఏమిటన్నదానిపై ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. ఇది జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో నడిచే కథ అని తెలుస్తోంది. 1970  కాలంలో జరిగినట్టుగా చూపిస్తారట. ఈ కాలానికి ముడిపెడతారట. అలాగే ఇదో థ్రిల్లర్‌ అని, యాక్షన్‌ అంశాలకూ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.

 ఎక్కువ భాగం విదేశాల్లోనే తెరకెక్కిస్తారని సమాచారం. ఆర్ట్ డైరక్టర్ రవీంద్ర...ఇప్పటికే ఈ చిత్రం కోసం ఓ ఫిక్షన్ విలేజ్ సెట్ ని డిజైన్ చేసారు. ఇటలిలో ఆ రోజుల్లో జరిగే కథ ఇది. జ్యోతిష్య  శాస్త్తానికి సంభందించిన కొన్ని అంశాలు చాలా ఉత్కంఠ కలిగిస్తాయని చెప్పుకుంటున్నారు.  ప్రభాస్ ఇప్పటివరకూ చేసే,చేస్తున్న సినిమాలు ఒకెత్తు..ఇదొక ఎత్తు అని, జనం మాట్లాడుకునే సినిమా అవుతుందని టీమ్ చెప్తోంది.