పూజాహెగ్డేకి ప్రభాస్ షాక్..!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 18, Aug 2018, 5:43 PM IST
Prabhas No To Pooja Hegde In Radha Krishna Film
Highlights

ప్రభాస్ తో ఆమె నటించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం పూజాకి బదులుగా మరొక హీరోయిన్ ని చూడమని దర్శకనిర్మాతలకు సూచించినట్లు సమాచారం. హీరోయిన్ గా ఇప్పటివరకు ఆమె ఖాతాలో సరైన హిట్టు లేదు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి పని చేయనున్నాడు. 'జిల్' సినిమా తరువాత రాధాకృష్ణ కుమార్.. ప్రభాస్ తో కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నాడు.

త్వరలోనే ప్రభాస్ ఈ సినిమా మొదలుపెట్టనున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేని తీసుకోవాలని దర్శకుడు రాధాకృష్ణ అనుకున్నారు. ప్రభాస్ తో ఆమె నటించడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం పూజాకి బదులుగా మరొక హీరోయిన్ ని చూడమని దర్శకనిర్మాతలకు సూచించినట్లు సమాచారం. హీరోయిన్ గా ఇప్పటివరకు ఆమె ఖాతాలో సరైన హిట్టు లేదు.

ఈ కారణంగానే ప్రభాస్ తన సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా వద్దనుకుంటున్నాడట. దీంతో ఇప్పుడు మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ప్రభాస్ తీసుకున్న డెసిషన్ తో చేసేదేంలేక సైలెంట్ గా ఉండిపోయింది పూజా. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అలానే మహేష్ సరసన 'మహర్షి' సినిమాల్లో నటిస్తున్నారు. 

loader