ప్రభాస్ నటించిన సాహో సినిమాపై మిక్సిడ్ టాక్ ఎంత ఉన్నా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా ఆశ్చర్యపరిచింది. అయితే బాలీవుడ్ లో సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. సినిమా తెలుగు తమిళ్ హిందీ మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజైన సంగతి తెలిసిందే.   

అయితే హిందీలో ఈ ఏడాది మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల లిస్ట్ లో సాహో కూడా చేరింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సాహో 125కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ఆల్ టైమ్ రికార్డ్ ను అందుకుంది. ఇక హిందీలో సల్మాన్ అక్షయ్ లాంటి స్టార్స్ కి దగ్గరలో ప్రభాస్ నిలిచాడు. హిందీలో సాహో మొదటిరోజు 24.40కోట్లను అందుకుంది. 

2019 హిందీలో మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న టాప్ మూవీస్ 

భారత్.....................42.30cr

మిషిన్ మంగళ్.......29.16cr 

సాహో....................24.40cr 

కళంక్......................29.16cr 

కేసరి........................21.06cr