సౌత్ మొత్తంలో చూసుకుంటే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవుంతుంది. ఇక ఆ తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సౌత్ లో భారీగా విడుదలవుతుంది. ఇక ఇప్పుడు నేషనల్ లెవెల్లో మరో సౌత్ తెలుగు హీరో సరికొత్త రికార్డ్ అందుకోవడానికి సిద్దమయ్యాడు. 

దేశంలో ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగుళూరు సిటీలో గతంలో రజినీ - మహేష్ ల సినిమాలు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఒక్కరోజులోనే 400కు పైగా షోలు ప్రదర్శించబడేవి. అయితే ఆ తరువాత దేశంలో ఏ హీరో కూడా ఫస్ట్ డే రిలీజ్ తో ఆ రికార్డ్ ను అందుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ సినిమా సాహో కూడా అదే స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 

బెంగళూరులో మొదటిరోజు ఒకేసారి 400కు పైగా సాహో షోలు ప్రదర్శించే విధంగా సినిమా రెడీ అవుతోంది. సినిమా ఆగస్ట్ 30న దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో కన్నడ రాష్ట్రంలో బాహుబలి సినిమాతో భారీగా వసూళ్లను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు సాహో సినిమాతో ఏ స్థాయిలో రాబడతాడో చూడాలి.