బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి ఖాయమని గతంలో వార్తలు పెళ్లి గురించి అడిగినప్పుడల్లా తెలివిగా తప్పించుకుంటున్న ప్రభాస్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడన్నది చెప్పేసిన జ్యోతిష్యుడు నాగ్ నాథ్
ప్రస్థుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే.. అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంతకాలం బాహుబలితో బిజీగా ఉండటంతో ప్రభాస్ పెళ్లి గురించి రూమర్లు వచ్చినా.. ఇప్పట్లో ఉండదులే అంటూ కొట్టి పారేశారు. అయితే ఐదేళ్ల బాహుబలి ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయినా, ప్రభాస్ ఇప్పుడు కూడా పెళ్లి మాటే ఎత్తడం లేదు. కొత్త సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. తాజాగా సాహోలో నటిస్తున్న ప్రభాస్ 40 ఏళ్లకు చేరువవుతున్న డు. అయితే ప్రభాస్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రభాస్ ఎప్పుడు పెళ్లిచేసుకుంటాడు? లవ్ మ్యారేజా? ఆరెంజ్‌డ్ మ్యారేజా? వధువు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీ నాగ్‌నాథ్ తాజాగా జోస్యం చెప్పారు.
కుజదోషంతో పాటు స్వల్ప కాల స్వర్పదోషం ఉండటం వల్ల ప్రభాస్ పెళ్లి వంటి కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని నాగ్‌నాథ్ చెప్పారు. తులరాశిలో జన్మించిన ప్రభాస్‌కు 2018 మార్చి నుంచి ఎప్రిల్ మధ్య ప్రభాస్‌కు వివాహ యోగం ఉందని ఆయన తెలిపారు. మ్యారేజ్ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ లైఫ్ కూల్ గా ఉంటుందని చెప్పారు.
వధువు ఎటువైపు నుంచి వస్తుందో కూడా నాగ్‌నాథ్ వివరించారు. ప్రభాస్ తండ్రి జన్మించిన ప్రాంతం నుంచి చూస్తే తూర్పు-ఈశాన్యం వైపు నుంచి ప్రభాస్‌కు వధువు వస్తుందట. అంటే ప్రభాస్ తండ్రి ఎక్కడ జన్మించాడో తెలుసుకుంటే ఆ వధువు ఎటువైపు నుంచి వస్తుందో తెలుస్తుందన్నమాట.
నమస్తే తెలుగు యూట్యూబ్ చానల్‌లో పెళ్లెప్పుడవుతుంది బాబూ.. ప్రొగ్రాం వస్తోంది. తాజాగా విడుదల చేసిన ఎపిసోడ్‌లో ప్రభాస్ మ్యారేజ్ లైఫ్ గురించి నాగ్‌నాథ్ జోస్యం చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది

