మెగాడాటర్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..?

మెగాడాటర్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..?

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ జాతకాల ప్రస్తావన తేవడంతో పెళ్లి వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది.

 

బాహుబలి తర్వాతనే పెళ్లి ప్రభాస్ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు బాహుబలి తర్వాత చేసుకొంటానని చెప్పేవాడు. బాహుబలి సినిమా పూర్తయి సుమారు ఏడాది కావస్తోంది. అయినా పెళ్లిపై అంతగా ప్రభాస్ చూపడం లేదనేది ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం సాహో చిత్రంలో ప్రభాస్ బిజీగా ఉన్నారు.

 

తాజాగా ప్రభాస్, మెగా డాటర్‌తో పెళ్లి జరుగుబోతున్నదనే ఓ నిరాధారమైన వార్త మీడియాలో, యూట్యూబ్ చానెళ్లలో ప్రచారమవుతున్నది. అయితే ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న కృష్ణంరాజుతో మెగా కుటుంబ సభ్యులు మాట్లాడారనేది ఆ రూమర్ సారాంశం.

 

ప్రభాస్ పెళ్లి మెగా డాటర్‌ నిహారికతో పెళ్లి జరుగనుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలన్ని అబద్దాలేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది.

 

 తాజాగా మరో వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి కుదిరే అవకాశం ఉంది. జాతకాలు చూస్తన్నారు. ఒకవేళ జాతకాలు కుదిరితే పెళ్లి జరుగుతుంది అని కృష్ణంరాజు చెప్పడాన్ని బట్టి ప్రభాస్ పెళ్లి ఎంతో దూరం లేదు అనిపిస్తున్నది.

 

ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరి ప్రభాస్ పెళ్లి సాహో తర్వాత జరుగుతుందా? లేదా అంతకుముందే జరుగుతుందా అనేది చూడాలి.

మరోపక్క అనుష్క, ప్రభాస్ ల పెళ్లి పైనా పలు రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యధా సోషల్ మీడియా.. తథా పుకారు..

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page