2024 సంక్రాంతి సమరం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడు బడా చిత్రాలు బరిలో ఉండగా విజయ్ దేవరకొండ సైతం ప్రకటించారు.
విజయ్ దేవరకొండ 13వ చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 54వ చిత్రంగా తెరకెక్కుతుంది. దర్శకుడు పరుశురామ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అంటే రానున్న ఆరు నెలల్లో షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ పూర్తి కానున్నాయి. ఇప్పటికే మూడు బడా ప్రాజెక్ట్స్ సంక్రాంతి బెర్ట్ కన్ఫర్మ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రభాస్-నాగ్ అశ్విన్ ల భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ విడుదల కూడా సంక్రాంతికే. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.
రవితేజ ఈగల్ అంటూ సంక్రాంతి సీజన్ పై కన్నేశాడు. వీరితో విజయ్ దేవరకొండ జాయిన్ అయ్యాడు. ఇది దిల్ రాజు మూవీ. అంటే థియేటర్స్ వివాదం తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను చేతిలోకి తీసుకున్న ఇతర నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడనే అపవాదు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతికి థియేటర్స్ పంచాయితీ కామనై పోయింది.
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలకు థియేటర్స్ లేకుండా వారసుడు మూవీ కోసం బ్లాక్ చేశాడు. ఈ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. చివరి తగ్గిన దిల్ రాజు వారసుడు విడుదల జనవరి 14కి వాయిదా వేశాడు. ముందుగా ప్రకటించినట్లు జనవరి 11న విడుదల చేస్తే మైత్రీ మూవీ మేకర్స్ ఇబ్బందిపడేవారు. కలెక్షన్స్ కోల్పోయేవారు. ఈసారి దిల్ రాజు విజయ్ దేవరకొండ మూవీ కోసం ప్రభాస్, మహేష్, రవితేజ నిర్మాతలను ఇబ్బంది పెడతాడేమో అనే సందేహాలు మొదలయ్యాయి.
