MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Vijay Rashmika: చిన్నారికి ఊహించని ట్రీట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. విరోష్‌తో కలిసి ఏం చేసిందంటే

Vijay Rashmika: చిన్నారికి ఊహించని ట్రీట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా.. విరోష్‌తో కలిసి ఏం చేసిందంటే

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు తమకి స్వీట్లు ఇవ్వలేదని, విందుకు పిలవలేదని ఓ చిన్నారి వీడియో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఆ చిన్నారి కుటుంబాన్ని ఇంటికి పిలిచి సర్‌ప్రైజ్‌ చేసింది విరోష్‌ ఫ్యామిలీ. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 21 2026, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్‌ దేవరకొండ, రష్మికలకు చిన్నారి రిక్వెస్ట్
Image Credit : instagram/@urs_luckythalli

విజయ్‌ దేవరకొండ, రష్మికలకు చిన్నారి రిక్వెస్ట్

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 26న మ్యారేజ్‌ చేసుకోగా, ఆ తర్వాత సినిమా సెలబ్రిటీలకు, అభిమానులకు, మీడియాకి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. అంతేకాదు స్వీట్లు పంచారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు,  కొన్ని టెంపుల్స్ వద్ద అన్నదానం చేశారు. దీంతో వీరి పెళ్లి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. చాలా మందిని పిలిచి విందు ఏర్పాటు చేయగా, తమని పిలవలేదని ఓ చిన్నారి సోషల్‌ మీడియాలో వీడియో పెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిన్నారికి రియాక్ట్ అయిన విజయ్‌, రష్మిక జంట
Image Credit : instagram/@urs_luckythalli

చిన్నారికి రియాక్ట్ అయిన విజయ్‌, రష్మిక జంట

`లక్కీ తల్లి` అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి ఒక చిన్నారి విజయ్‌ దేవరకొండ మామ, రష్మిక అక్క మీరు అందరిని పిలిచిన స్వీట్లు, అన్నదానం చేశారు. మరి మమ్మల్ని పిలవరా, మేము కూడా మీ అభిమానులమే కదా, మమ్మల్ని పిలవొచ్చు కదా అంటూ సోషల్‌ మీడియాలో వీడియో పెట్టింది. ఇది వైరల్‌గా మారింది. అది కాస్త, విజయ్‌, రష్మికలకు చేరింది. దీంతో ఈ ఇద్దరు ఆ చిన్నారికి స్పందించారు. `బుజ్జి తల్లి, నిన్ను ఇంటికి లంచ్‌కి పిలుస్తాం, నీకు ఇష్టమైన ఫుడ్‌, స్వీట్స్ చెప్పు, అన్నీ కలిసి తిందాం` అని రిప్లై ఇచ్చారు.

Related Articles

Related image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Related image2
Top 10 Heroines: దుమ్ములేపిన రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
35
చిన్నారి ఫ్యామిలీకి విరోష్‌ జంట ట్రీట్‌
Image Credit : instagram/@urs_luckythalli

చిన్నారి ఫ్యామిలీకి విరోష్‌ జంట ట్రీట్‌

చెప్పడమే కాదు ఏకంగా ఆ చిన్నారి ఫ్యామిలీని విజయ్‌ దేవరకొండ ఇంటికి పిలిపించారు. ఆ చిన్నారి ఫ్యామిలీకి  విజయ్‌, రష్మిక భోజనం ఏర్పాటు చేశారు. అంతా కలిసి భోజనం చేశారు. వారికి స్వీట్లు తినిపించారు. అలాగే పులిహోర పెట్టారు. అంతేకాదు వారికి నచ్చిన, ఇష్టమైన ఫుడ్‌ని వడ్డించారు. వీటితోపాటు గిఫ్ట్ లతో సర్‌ప్రైజ్‌ చేశారు. తాజాగా ఆ విషయాన్ని లక్కీ తల్లి చిన్నారి తన సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli)

45
విజయ్‌, రష్మికలకు థ్యాంక్స్ చెప్పిన చిన్నారి
Image Credit : instagram/@urs_luckythalli

విజయ్‌, రష్మికలకు థ్యాంక్స్ చెప్పిన చిన్నారి

ఇందులో లక్కీ తల్లి చిన్నారి పేరెంట్స్ చెబుతూ, విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా, వారి కుటుంబాన్ని కలవడం ఆనందంగా ఉందని, వారి చిరునవ్వు, స్నేహ పూర్వక స్వభావం ఈ టూర్‌కి సంతోషాన్ని చేకూర్చిందని తెలిపారు. వారితోపాటు వారి కుటుంబంతో గడిపిన సమయం ఈ అనుభవాన్ని ప్రత్యేకంగా, సొంత ఇంటి వాతావరణంలా అనిపించేలా చేసిందని చెప్పారు. వారంతా ఎంతో ప్రేమతో, దయతో, నిరాడంబరంగా ఉన్నారని, దీంతో మేమూ వాళ్ల మధ్య ఉన్నామనే భావన కలిగిందన్నారు. ఎన్నో అందమైన సంభాషణలు, నవ్వులు, ఎప్పటికీ గుర్తిండిపోయే ఆనంద క్షణాలను పంచుకున్నాం. అక్కడి వాతావరణం హృదయాన్ని హత్తుకునే అనుభూతినిచ్చింది. వారు ప్రతిభావంతులే కాదు, వినయవంతులు. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేము అని వెల్లడించారు. ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by urs lucky thalli 😍 (@urs_luckythalli)

55
రణబాలిలో కలిసి నటిస్తోన్న విరోష్‌ జంట
Image Credit : instagram/@urs_luckythalli

రణబాలిలో కలిసి నటిస్తోన్న విరోష్‌ జంట

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి ఇప్పుడు `రణబాలి` చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీంతోపాటు రష్మిక మందన్నా `మైసా`అనే మరో సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్‌ దేవరకొండ `రౌడీ జనార్థన్‌` మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mamitha Baiju: ఆ హీరోయిన్ ఉంటే 100 కోట్లు గ్యారెంటీ, పట్టిందల్లా బంగారమే.. రెమ్యునరేషన్ కూడా చుక్కల్లోకి
Recommended image2
Ram Charan: అది బ్యాడ్ మూవీ కాదు, రాంచరణ్ సినిమాపై డైరెక్టర్ కామెంట్స్.. స్టైలిష్ గా ఉంటుంది, అయినా ఫ్లాప్
Recommended image3
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Recommended image2
Top 10 Heroines: దుమ్ములేపిన రష్మిక, కాజల్‌, తమన్నా.. పడిపోయిన త్రిష, శ్రీలీల.. నెంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved